Breaking News

ఆత్మనిర్బర్ భారత్ లో 24 రంగాలపై నజర్

27 th Sep 2020, UTC
ఆత్మనిర్బర్ భారత్ లో 24 రంగాలపై నజర్

ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా ది డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్  (డిపిఐఐటి) దేశీయంగా బొమ్మలు, ఫర్నిఛర్ తయారీని పెంచాలని నిర్ణయించింది. బొమ్మలు, ఫర్నిచర్, ఆగ్రో కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్ టైల్స్ , సేంద్రియ వ్యసాయం, ఐరన్, అల్యూమినియం, కాపర్, ఎలక్టానిక్స్, ఇండస్ట్రియల్ మెషినరి, లెదర్ తదితర 24  రంగాల్లో స్వయం సమృద్దిని సాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతీ మంత్రిత్వ శాఖ నుంచి పైన పేర్కొన్న రంగాలకు వారికేం కావాలన్నది తెలియజేయాలని కోరాయని కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు తెలిపారు. మీకు  ఏం కావాలనుకుంటున్నారు? దానికి మేం ఏం చేయగలం? అంటూ స్ఫష్టత నివ్వాలని ఆయా మంత్రిత్వ శాఖలు అడిగాయి.

దేశీయంగా స్వావలంబన సాధించడం, ఎగుమతులను పెంచాలనే కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలకనుగుణంగా డిపిఐఐటి ముందుకు సాగుతోంది. ఈ దిశగా ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించారు. తయారీ పరిశ్రమను ప్రోత్సహించడం, ఎగుమతులను పెంచడం లక్ష్యంగా పలు నిర్ణయాలు కూడ తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఎగుమతులకు ఎక్కడ డిమాండ్ వుందనే విషయానికనుగుణంగా చర్యలు తీసుకుంటారు. భారతీయ తయారీ రంగం దేశ ఆర్దిక వ్యవస్దలో  15 శాతం వాటాను, ఎగుమతుల్లో 78 శాతం వాటాను కలిగి వుంది. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox