Breaking News

48 గంటల్లో క్షమాపణ చెప్పాలి. సంజయ్ రావత్ కు సుశాంత్ బంధువు హెచ్చరిక

12 th Aug 2020, UTC

ముంబై :బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రావత్‌పై సుశాంత్ బంధువు, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ బబ్లూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 48గంటల్లోగా సుశాంత్ కుటుంబానికి రావత్ క్షమాపణ చెప్పాలనీ, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బబ్లూ హెచ్చరించారు. సుశాంత్, ఆయన తండ్రి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని సంజయ్ రావత్ ఆరోపించారు. దీంతో ఆయన తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ లీగన్ నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. 

ఒక పార్టీ ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారంటూ బీహార్ డీజీపీ పైనా రావత్ ఆరోపణలు చేశారు. దీనిపై బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్పందిస్తూ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పైనా సంజయ్ రావత్ అసభ్య పదజాలం ఉపయోగించారు. వాస్తవాలు తెలుసుకోకుండా సుశాంత్ తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చెబుతున్నవన్నీ అబద్ధాలే. ఓ బాధ్యతగల వ్యక్తిగా రావత్ అలా మాట్లాడకూడదు, అని పేర్కొన్నారు.

దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ తన దగ్గరున్నసమాచారం ఆధారంగానే తాను మాట్లాడానని, ఆ సమాచారంలో ఏదైనా లోపించి ఉంటే ఆ విషయంపై దృష్టా సారిస్తానని చెప్పారు.'మా వైపు నుంచి సమాచారం ఏదైనా లోపించినట్లయితే దానిపై ఆలోచిస్తాం. ఇంతవరకూ నేను ఏదైతే చెప్పానో అదంతా నా దగ్గరున్న సమాచారం బట్టే చెప్పాను. అలాగే సుశాంత్ కుటుంబం కూడా వారి వద్దనున్న సమాచారం ఆధారంగానే మాట్లాడి ఉండొచ్చు' అని సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ తరపు లాయర్ అనిష్ ఝా మాట్లాడుతూ, సుశాంత్ మృతి కేసుకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన కుటుంబానికి సంజయ్ రౌత్ 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారని, అందుకే తాము నోటీసులు పంపుతున్నామని చెప్పారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox