Breaking News

2022 అసెంబ్లీ ఎన్నికలు .. 64 మంది అభ్యర్దుల జాబితాను ప్రకటించిన శిరోమణి అకాలీదళ్

14 th Sep 2021, UTC

శిరోమణి అకాలీదళ్  వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తన మొదటి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన పంజాబ్‌లో మొదటి పార్టీగా అవతరించింది. మూడు వ్యవసాయ చట్టాల ఆమోదంపై బిజెపితో సంబంధాలు తెంచుకున్న తరువాత, ఎస్ఎడి జూన్‌లో బిఎస్‌పితో పొత్తు పెట్టుకుంది. 64 మంది అభ్యర్థుల జాబితాలో పార్టీ అధ్యక్షుడు మరియు లోక్‌సభ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఉన్నారు. అతను జలాలాబాద్ నుండి ఎన్నికల్లో పోటీ చేస్తారు.

మాజీ మంత్రులు తోట సింగ్, జనమేజా సింగ్ సెఖోన్, దల్జిత్ సింగ్ చీమా మరియు శరంజిత్ సింగ్ ధిల్లాన్‌లకు వరుసగా ధరమ్‌కోట్, జిరా, రూప్‌నగర్ మరియు సహనేవాల్ స్దానాలకు అభ్యర్దులుగా ప్రకటించారు.  ఎస్ఎడి నేతప్రకాష్ సింగ్ బాదల్ అల్లుడు అదీష్ పార్తప్ సింగ్ కైరాన్ పట్టి నియోజకవర్గం నుండి పోటీ చేస్తారు.  బీజేపీ సాంప్రదాయకంగా పోటీ చేసే స్దానాలయిన లూథియానా ఈస్ట్, లూథియానా సెంట్రల్, లూథియానా వెస్ట్, ఫజిల్కా, రాజ్‌పురా, అమృత్‌సర్ నార్త్, అమృత్‌సర్ వెస్ట్, సుజన్‌పూర్, జలంధర్ సెంట్రల్ మరియు ముఖేరియన్ స్దానాలకు ఎస్ఎడి పార్టీ అభ్యర్థులను  ప్రకటించింది.

2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో, 117 సభ్యుల  శాసనసభలో కాంగ్రెస్ అత్యధికంగా 77 సీట్లను గెలుచుకుంది. శిరోమణి అకాలీదళ్ 18 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. మరోవైపు, ఆప్ 20 స్థానాలతో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox