Breaking News

హర్యానాలో 1700 డోసుల కరోనా వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లిన దొంగలు

22 nd Apr 2021, UTC

హర్యానా :కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని బలంగా తాకిన నేపధ్యంలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ డ్రైవ్ వేగంగా సాగుతున్నప్పటికీ పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి.

హర్యానాలోని జింద్ యొక్క పిపి సెంటర్ జనరల్ హాస్పిటల్ స్టోర్ రూమ్‌లోకిదొంగలు  ప్రవేశించి దాదాపు 1,710 డోసుల కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లను దొంగిలించారు. ప్రస్తుతం జిల్లాలో వ్యాక్సిన్లు లేవు.స్టోర్ రూమ్‌లోని ఇతర మందులు, నగదును వారు తీసుకోకపోవడం గమనార్హం.  కేవలం కరోనా వ్యాక్సిన్లనే నిందితులు లక్ష్యంగా చేసుకున్నారు.హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ స్టోర్ రూమ్ దగ్గర సిసిటివి కెమెరాను ఏర్పాటు చేయలేదు. దొంగతనాలను నిరోధించడానికి గార్డును నియమించలేదు.గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కోవిడ్ -19 వ్యాక్సిన్లను వృధా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటిలో హర్యానా రెండవ స్దానంలో వుండగా పంజాబ్ మూడవ స్థానంలో ఉంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox