Breaking News

ఎయిర్ టెల్   2జీ  కస్టమర్లకు జీరో కాస్ట్ లోన్

29 th Oct 2020, UTC

ఎయిర్ టెల్ తన 2జీ వినియోగదారులకు 4జీ స్మార్ట్ ఫోన్లు కొనడానికి ’జీరో కాస్ట్ లోన్’ అనే కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.  దీనికోసం ఎయిర్ టెల్ ఐడీఎఫ్‌సీ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఐడీఎఫ్‌సీ బ్యాంక్ డౌన్ పేమెంట్ రూ.3,259 కట్టడానికి వినియోగదారులకు లోన్ ఇస్తుంది. ఎయిర్ టెల్ అందించే ఫోన్ అసలు ధరరూ.6,800.

దీంతోపాటు వినియోగదారులు నెలనెలా రూ.603 ఈఎంఐ రూపంలో పదినెలలు  చెల్లించాల్సి ఉంటుంది.  అంటే వినియోగదారులు మొత్తంగా రూ.9,289 చెల్లించాలి. అయితే నెలనెలా వినియోగదారుని మొబైల్ టారిఫ్ ప్లాన్ కూడా ఇందులోనే  వుండటం వల్ల  వినియోగదారులు ఈ పది నెలల కాలంలో ప్రత్యేకంగా మొబైల్ రీచార్జ్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ కాస్ట్‌తో పోలిస్తే తాము అందించేది చాలా తక్కువ అని ఎయిర్ టెల్ అంటోంది.

ఎయిర్ టెల్ ఈ ఆఫర్‌ను కేవలం 60 రోజుల పాటు మాత్రమే అందించనుంది. అంతేకాకుండా అర్హులైన వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుందని ఎయిర్ టెల్ తెలిపింది.ఎయిర్ టెల్ తన వైఫై కాలింగ్ ఫీచర్‌ను 200కు పైగా డివైస్‌లకు అందిస్తోంది. వాయిస్ ఓవర్ వైఫై అనే టెక్నాలజీపై ఈ వైఫై కాలింగ్ పనిచేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు తమ మొబైల్ సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు వైఫై ద్వారా వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. వో-వైఫై(వాయిస్ ఓవర్ వైఫై) టెక్నాలజీ ఆటోమేటిక్‌గా సిగ్నల్ కనెక్టివిటీని మొబైల్ నెట్ వర్క్ నుంచి వైఫైకి మార్చుకోవచ్చు. 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox