Breaking News

శ్రీవారి దర్శనానికి ఈ నెల 8 నుంచి ట్రయల్ రన్‌..!

03 rd Jun 2020, UTC

కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈ నెల 8 నుంచి ట్రయల్ రన్‌‌ నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు భౌతిక దూరం పాటిస్తూ టీటీడీ ఉద్యోగులు, స్థానికులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత అధికారుల సూచనల మేరకు శ్రీవారి దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించనున్నట్టు వెల్లడించారు. ప్రతి భక్తుడు శానిటైజేషన్‌ చేసుకోవడంతో పాటుగా, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఆన్‌లైన్‌లో టికెట్స్‌ బుక్‌ చేసుకున్నవారికి కూడా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీరికి అలిపిరి వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలిపిరి వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాతనే భక్తులను తిరుమలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీవారి పుష్కరిణిలో భక్తుల స్నానానికి అనమతి లేదన్నారు.

 శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనాపై కేంద్రం సూచించిన మార్గదర్శకాలు పాటించాలని కోరారు. కాగా, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలకు పైగా మూతపడ్డ తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి తెరుచుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆరడుగుల భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సప్తగిరి కధనంపై టీటీడీ నిరసన

 టీటీడీ సప్తగిరి మాసపత్రికలో రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం రాశారంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ జానపద కథలో కథనం ప్రచురితమైంది. ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాశాడు. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థ వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జానపదాల్లో రకరకాల ప్రచారాలపై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతందని వారు తెలిపారు. మరోవైపు రామాయణాన్ని వక్రీకరిస్తూ టీటీడీ మానసపత్రికలో కథనంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox