Breaking News

కరోనా పై ముందుగా హెచ్చరించింది మేమే: డబ్ల్యూహెచ్ఓ

04 th Jul 2020, UTC

కరోనా మహమ్మారిపై సమాచారాన్ని చైనాలోని తమ కార్యాలయమే తెలియజేసిందని,  చైనా కాదంటూ  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీన వుహాన్ నగరంలో న్యూమోనియా వంటి కేసులు నమోదైన సమయంలో మొదట కరోనాకు సంబంధించిన సమాచారాన్ని చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

చైనాను వెనకేసుకొస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆరోపణల నేపథ్యంలో ఈ వారంలో కరోనా వైరస్ గురించి డబ్ల్యూహెచ్ఓ వెల్లడించిన ‍ క్రోనాలజీలో తాజా  వివరాలను పొందు పర్చింది.  వైరల్ న్యుమోనియా కేసులను గుర్తించినట్టు వుహాన్ హెల్త్ కమిషన్ వెబ్‌సైట్‌లో డిసెంబరు 31న ప్రకటించిన తర్వాత చైనాలోని డబ్ల్యూహెచ్‌ఓ కార్యాలయం నుంచి తమకు సమాచారం వచ్చినట్టు పేర్కొంది.

 అలాగే అదే రోజు, అమెరికాలోని డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఎపిడిమియోలాజికల్ నిఘా నెట్‌వర్క్ ప్రోమెడ్ సైతం వుహాన్‌లో అంతుచిక్కని కారణాల వల్ల న్యుమోనియా కేసులు బయటపడినట్టు వెల్లడించిన నివేదికను పరిగణనలోకి తీసుకుని కొత్తరకం వైరస్ కేసుల గురించి ఈ ఏడాది జనవరి 1, 2 తేదీల్లో చైనా అధికారులను సమాచారం కోరితే, జనవరి 3న సమాచారం అందజేశారని వెల్లడించింది. చైనా పట్ల తమకు ఎలాంటి  పక్షపాత ధోరణి లేదని మరోసారి స్పష్టం చేసింది.

డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక సంఘటనను అధికారికంగా ధ్రువీకరించడానికి, దాని స్వభావం లేదా కారణం గురించి అదనపు సమాచారాన్ని అందజేయడానికి దేశాలకు 24-48 గంటలు సమయం ఉంటుందన్నారు. తమ నివేదికను ధ్రువీకరించమని కోరిన వెంటనే చైనా అధికారులు డబ్ల్యూహెచ్‌ఓను సంప్రదించారని ర్యాన్ తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox