Breaking News

మళ్ళీ మొదలు పెట్టిన వాట్సాప్.. ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే..?

23 rd Feb 2021, UTC

వాట్సాప్ గతవారం మరో ప్రకటనను చేసింది. ఇకపై వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ విధానం విషయంలో ముందుకు సాగనుంది. ఈ ప్రైవసీ పాలసీని అనుమతించాలని వినియోగదారులను కోరబోతోంది. ఒకవేళ, ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే, మే 15 నుంచి వారు వాట్సాప్ ను వినియోగించలేరని వాట్సాప్ స్పష్టం చేస్తోంది. అయితే, వాట్సాప్ 15 నుంచి వాట్సాప్ కొత్త సేవలు అందే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొత్త ప్రైవసీ పాలసీ, మరియు వాట్సాప్ అందించబోయే కొత్త సేవల గురించి చాల మందికి అవగాహనా లేకపోవడం వల్లనే వ్యతిరేకిస్తున్నారని వాట్సాప్ పేర్కొంటోంది. మరో వైపు, చాలా మంది వినియోగదారులు ఆల్టర్నేట్ యాప్ లను వినియోగిస్తున్నారు. వాట్సాప్ ప్రైవసీ పాలిసీ మరియు కొత్త సేవా విధానాల గురించి ఇదివరకే తన వినియోగదారులకు ఆప్ మెసేజ్ రూపంలో తెలియచేసింది. ఈ విధానాలను అంగీకరించకపోతే వారు వాట్సాప్ ను యూజ్ చేసే వెసులుబాటును కోల్పోతారు.

మే 15 నుండి "వాట్సాప్ యొక్క పూర్తి కార్యాచరణను కలిగి ఉండటానికి" క్రొత్త సేవా నిబంధనలను అంగీకరించమని వినియోగదారులను వాట్సాప్ కోరుతోంది. వినియోగదారులు కొత్త విధానాలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వకపోతే, వారికి నోటిఫికేషన్లు కనిపిస్తాయి కానీ, వారు అందులో వచ్చే మెసేజ్ లను చదవలేరు, వాటికి రిప్లై లు ఇవ్వలేరని వాట్సాప్ పేర్కొంది. ఈ కొత్త పాలసీని యాక్సెప్ట్ చేయకపోతే కొంతకాలం మాత్రమే వాట్సాప్ కు యాక్సెస్ ఉంటుంది. ఆ తరువాత యాక్సెస్ ను కూడా రద్దు చేస్తారు. వాట్సాప్ తన బ్లాగులో ఏమని పేర్కొందంటే కొత్త ప్రైవసీ పాలసీకి సంబంధించిన తప్పుడు సమాచారం ఆందోళనకు గురి చేసిందని పేర్కొంది. అలానే, ఈ పాలసీ గురించి అందరికి అర్ధం అయ్యేలా చెప్పడం కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. మరిన్ని వార్తలు చదవండి 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox