Breaking News

గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది.. : కేటిఆర్

08 th Jul 2020, UTC

                 రాష్ట్రము లో.. పచ్చదనం పెంచడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత హారం ప్రాజెక్ట్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు విడతలను ప్రారంభించారు. ప్రతి ఏడాది.. మొక్కలు నాటే కార్యక్రమాన్ని తప్పనిసరి చేసారు.. నేడు హరితహారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్ట గ్రామంలో  కేటిర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు.. ఈ సందర్భం గా కేటిఆర్ మీడియా తో మాట్లాడారు. 
 
                 ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాల్ని చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రామాల్లో నాటిన మొక్కల్లో 85 శాతం బతకకపోతే... గ్రామ సర్పంచ్ పదవి పోయేలా పంజాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చామని  ఈ సందర్భం గా కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని అడవులను 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలంగాణ మంత్రి కేటీఆర్  చెప్పుకొచ్చారు.  రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు పది శాతం బడ్జెట్ ను కేవలం మొక్కలు పెంచడానికి ఉపయోగించిన ఏకైక సీఎం కేసీఆర్ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ సందర్భం గా చెప్పారు. 
 
                   ఇప్పటి వరకు 180 కోట్లకు పైగా మొక్కలను నాటామని  ఆయన గుర్తు చేసుకున్నారు. ఇలా మొక్కలు నాటడం వలన.. రాజకీయం గా చేకూరే లబ్ది ఏమి ఉండదని.. భవిష్యత్ తరాలకు మంచి చేసే ఉద్దేశం తోనే  ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఒకవేళ.. ఇపుడు మనము మొక్కలు పరిరక్షించుకోకపోతే.. భవిష్యత్ లో గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox