Breaking News

బాత్ టబ్ లు, బేసిన్లు, స్విమ్మింగ్ పూల్ అన్నింటికీ బంగారు పూత..!

04 th Jul 2020, UTC

లాక్‌డౌన్‌ అనంతరం వియత్నాం రాజధాని హనోయిలో డాల్స్‌ హనోయి గోల్డెన్‌ లేక్‌ హోటల్‌ సకల హంగులతో తిరిగి ప్రారంభమైంది.  అయితే అతిథులు, పర్యాటకులను ఆకర్షించేందుకు నిర్వాహకులు హోటల్ కు  అదనపు హంగులను సమకూర్చారు. బాత్‌టబ్‌ల నుంచి బేసిన్‌ల వరకూ చివరికి టాయిలెట్లకూ బంగారు పూత పూసారు.

  హు బిన్‌ గ్రూపుకు చెందిన ఈ హోటల్‌ను ప్రత్యేకంగా కనిపించేలా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇలాంటి హోటల్‌ మరెక్కడా లేదని హు బిన్‌ గ్రూప్‌ చీఫ్‌, హోటల్‌అధిపతి నుయెన్‌ హు దుంగ్‌ చెప్పారు.హోటల్‌ పైకప్పుపై 24 కేరట్ల బంగారు పూతతో స్విమ్మింగ్‌పూల్‌ ప్రధాన ఆకర్షణ కాగా, అతిథుల రూంలు, బాత్‌రూమ్‌ గోడలు బాత్‌టబ్స్‌కూ బంగారు పూత ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.  ఈ ఏర్పాట్లు చూసి అతిథులు ఆశ్చర్యపోతున్నారు.

 లగ్జరీ అంటే ఏంటో ఈ హోటల్‌ తిరగరాసిందని, ఇతర లగ్జరీ హోటళ్లు సహజంగా టైల్స్‌కు మార్బుల్స్‌ను వాడుతుంటే ఈ హోటల్‌లో వాషింగ్‌ బేసిన్‌తో సహా అన్నీ బంగారుపూతతో మెరిసిపోతున్నాయని అతిధులు అంటున్నారు. ఈ హోటల్‌లో బసకు ఒక రాత్రికి 18,176 రూపాయలు చెల్లించాలి.హోటల్‌ మొత్తం బంగారుపూత కోసం టన్ను బంగారాన్ని వాడామని హోటల్‌ అధిపతి హు దుంగ్ అన్నారు.

 ట్యాక్సీ డ్రైవర్‌గా  పనిచేసిన  దుంగ్‌ తరువాత నిర్మాణ, రియల్‌ఎస్టేట్‌ రంగంలో భారీగా సంపాదించారు. అనంతరంఆతిథ్య రంగంలోకి అడుగు పెట్టారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించకుంటే ఈ హోటల్‌ మొత్తం అంతర్జాతీయ అతిథులతో నిండిపోయేదని ఆయన అన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox