Breaking News

కేరళ హై కోర్టును ఆశ్రయించిన టూరిస్ట్..!

09 th Jul 2020, UTC
కేరళ హై కోర్టును ఆశ్రయించిన టూరిస్ట్..!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి వారక్కడే చిక్కుకుయ పోయారు. పలు దేశాల ప్రజలు తమ స్వదేశాలకు తిరుగుముఖం పడుతున్నారు..  అయితే 74 ఏళ్ల ఓ అమెరికా టూరిస్టు మాత్రం తనను కేరళలోనే ఉండనివ్వాలంటూ కోర్టును ఆశ్రయించాడు.

ఐదు నెలల పాటు కేరళలో నివాసం తనకు ఎనలేని మనశ్శాంతిని ఇచ్చిందనీ.. ఇక జీవితాంతం ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నానని జానీ పాల్ పియర్స్ అనే వృద్ధుడు కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. తన టూరింగ్ వీసాను బిజినెస్ వీసాగా మార్చునేందుకు అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థించాడు.

ఏదైనా మంచి  వ్యాపార నమూనాను చూపించి.. ఐదేళ్ల వ్యాపార వీసా పొందాలన్నది నా ఆకాంక్ష. భారత అమ్మాయిని వివాహం చేసుకుంటే ఇక్కడ సులభంగా పౌరసత్వం పొందవచ్చుకానీ.. 74 ఏళ్ల నాకు ఇప్పుడు ఆ అవకాశం లేదు... అని పియర్స్ పేర్కొన్నారు.

 కేరళలో విదేశీయుల కోసం ఓ రిజువనేషన్ సెంటర్ ప్రారంభించాలని అనుకుంటున్నట్టు ఈ పెద్దాయన తెలిపారు. అమెరికాలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. నాకు కేరళ అంటే చాలా ఇష్టం. నాకు వెనక్కి వెళ్లాలని లేదు. ఇక్కడే ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను.. అని పియర్స్ పేర్కొన్నారు.
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox