Breaking News

నేడు జాతీయ యువకుల దినోత్సవం..!

12 th Jan 2021, UTC
నేడు జాతీయ యువకుల దినోత్సవం..!

జనవరి 12 స్వామి వివేకానంద జన్మదినం. ఆయనకు గౌరవ సూచకం గా ఆయన పుట్టిన రోజుని జాతీయ యువకుల దినోత్సవంగా జరుపుకుంటారు. 1984 లో భారత ప్రభుత్వం వివేకానంద జన్మదినాన్ని జాతీయ యువకుల దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. స్వామి వివేకానంద కోల్‌కతాలో జన్మించారు. ఆయన తన 39 సంవత్సరాల వయసులోనే (12 జనవరి 1863 - జూలై 4, 1902) మరణించారు. ఆయన జ్ఞానం, భవిష్యత్ పట్ల ఆయనకు ఉన్న దృక్పధం, సముద్రం వంటి అపారమైన జ్ఞాన సంపద తో ఆయన భారత యువకులకు మార్గదర్శకం చేసారు.

స్వామి వివేకానంద.. అనేది కేవలం ఒక పేరు కాదు. ఒక శక్తీ. ఆయనకు ఉన్న అపార జ్ఞానంతో ఎందరో యువకుల్లో శక్తిని, ధైర్యాన్ని నింపారు. దేశ అభివృద్ధికి యువతే కీలకమని, యువత బద్ధకాన్ని వదిలి జ్ఞానం వైపు ప్రయాణం చేయాలని, ఉత్సాహంతో పోరాడాలని ఆయన లోకానికి చాటి చెప్పారు. ఆయన జీవిత కాలం స్వల్పమే అయినా, ఆయన చెప్పిన మాటలు ఎందరికో దారి చూపాయి. ఆయన మరణించి ఏళ్ళు గడుస్తున్నా, ఇప్పటికీ ఆయన వాక్యాలు మనకి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. లింగం, మతం, కులం వంటి అసమానతలను పక్కన పెట్టి, ఆయన మార్గదర్శకం చేసారు. దేశంలో మహిళలను చూస్తున్న తీరుపై కూడా ఆయన ఎంతో బాధపడ్డారు.

దేశానికీ మహిళలే ఎంతో బలమని, వారు విద్యావంతులుగా, స్వతంత్రులు గా ఉండాలని స్వామి వివేకానంద కోరుకున్నారు. వివేకానంద అసలు పేరు నరేంద్ర నాధ్. చిన్నతనం నుంచే ఆయన ఎంతో దేశభక్తిని చూపేవారు. నిజమైన భారతాన్ని చూడాలంటే, దేశ వీధుల గుండా నడవాలని ఆయన చెపుతుండేవారు. ఆయన కాలినడకనే దాదాపు దేశమంతా పర్యటించాడు. దేశభక్తిని పెంపొందించడమే కాక, మానవత్వాన్ని ఆచరించి చూపించాడు. పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులు, నిరక్షరాస్యత వంటివి లేకుండా ఆధునిక భారతాన్ని చూడాలని ఆయన కలలుగన్నారు. 

పని చేయడం ద్వారా సాధించే విజయాల గురించి వివేకానంద లోకానికి చాటిచెప్పారు. యువతను పిలుపునిస్తూ, ఎవరి పై ఆధారపడకుండా పని చేయడం నేర్చుకోవాలని.. భారత అభివృద్ధి యువత చేతిలోనే ఉందని ఆయన యువతను మేలుకొలిపారు. భారత భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందని చెప్పారు. మీరు కోరుకుంటే, తీవ్రమైన చిత్తశుద్ధితో, సంపూర్ణ నిస్వార్థంగా, మరియు అన్నింటికంటే, సంపూర్ణ స్వచ్ఛంగా ఉండటంలో ఆయనను అనుకరించాల్సిందిగా కోరారు. అందుకు ఆయన ఆశీస్సులు ఎల్లపుడు ఉంటాయి. మాట్లాడటానికి సమయం వృధా చేయవద్దని, ఎల్లప్పుడూ పని పైనే ధ్యాస ఉంచాలని ఆయన కోరారు. స్వామి వివేకానంద మాటలు యువతకు సదా ఆచరణీయం. ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. మన దేశ అభివృద్ధికి దోహద పడదాం. మరిన్ని వార్తలు చదవండి 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox