Breaking News

వైద్యరంగంలో నోబెల్ విజేతలు వీరే..

04 th Oct 2021, UTC
వైద్యరంగంలో నోబెల్ విజేతలు వీరే..

ఈ ఏడాది వైద్యరంగంలో డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌషియన్ లకు సంయుక్తంగా నోబెల్ బహుమతి ప్రకటించారు. ఉష్ణోగ్రత, స్పర్శలకు సంబంధించిన గ్రాహకాలను ఆవిష్కరించిన వారిద్దరికీ ప్రపంచ అత్యున్నత పురస్కారం లభించింది.మానవ మనుగడకు  అవసరమైన వేడి, చల్లదనం, స్పర్శ జ్ఞానం మెదడుకు చేరే క్రమంలో నరాలు ఎలా ప్రేరేపించబడతాయి? వాటి స్పందనలు ఎలా ప్రారంభం అవుతాయి? అనే అంశంలో డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌషియాన్ తమ పరిశోధనల ద్వారా తగిన సమాధానం రాబట్టారు.

డేవిడ్ జూలియస్ అమెరికాకు చెందిన వైద్య పరిశోధన రంగ నిపుణుడు కాగా, ఆర్డెమ్ పటాపౌషియన్ మాలిక్యులర్ బయాలజిస్ట్. పటాపౌషియన్ కూడా అమెరికా జాతీయుడే.అవార్డులో భాగంగా పసిడి పతకం, 10 మిలియన్ స్వీడిష్ క్రానర్ (దాదాపు 1.14 మిలియన్ డాలర్లు) అందిస్తారు. అలాగే, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో నోబెల్ ప్రైజ్‌ను బహూకరిస్తారు. మరో వారం రోజుల్లోనే ఈ అవార్డులు ప్రకటించనున్నారు. 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox