Breaking News

సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందీ అంటే.. మోహన్ బాబు

12 th Oct 2021, UTC

సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందీ అంటే.. ఆలోచించుకోవడానికే ఆ తర్వాత విజృంభిస్తుంది అని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అన్నారు. సోమవారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ సముద్ర కెరటం ఓ.. అని ఉప్పొంగుతుంది.. అది వెనక్కి వెళ్లింది కదా అని అజాగ్రత్తతో ఉంటే.. సునామి వచ్చినట్లు ఉదృతి ప్రదర్శిస్తుంది. పొట్టేలు నాలుగడుగులు వెనక్కి వేసింది కదా.. అని మనం తిరుగుదాం అనుకునే లోపల నడుంపై కొడుతుంది. అది కొట్టిన దగ్గర రెండు పార్ట్‌లుగా విడిపోతుంది. అందుకని నేను చెప్పేది ఏమిటంటే.. నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు. అసమర్దుడిని కాను. మౌనంగా ఉండాలని అంతే అని అన్నారు.

ఏదైనా భగవంతుడు, కాలం నిర్ణయిస్తుంది. అంతా నాదే అనుకుంటాం.. మన చేతుల్లో ఏమీ లేదు. భగవంతుని నిర్ణయం ప్రకారం ఇదంతా జరిగింది. 17వ సంవత్సరాల క్రితం నేను ‘మా’ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యా. అక్టోబర్ 10వ తేదీనే. మరి దీనిని ఏమంటాం. ఇది అందరి విజయం. 883 మంది సభ్యుల ఆశీస్సులు ఉన్నాయి. నేను మాట్లాడాల్సి వస్తే.. చాలా ఉంది మాట్లాడడానికి. మీడియాకి తెలియని విషయాలు కాదు.నా బిడ్డ అందరి ఆశీస్సులతో విజయం సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా ఏమిటి? ‘మా’ అంటే ఏమిటి? ఎలక్షన్ ఏమిటి? ఏమిటీ గొడవలు.. ఏమిటీ భీభత్సం? అంటూ విద్యావంతులంతా పరిశీలిస్తున్నారు. గొర్రెలు మేపుకునే వాడు కూడా చూస్తున్నాడు. అతని దగ్గర కూడా సెల్‌ఫోన్ ఉంది. ఏం జరుగుతుంది? అని అతనూ చూస్తున్నాడు. కాబట్టి మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలని పేర్కొన్నారు.

 ముఖ్యమంత్రులు సహాయ సహకారం లేకపోతే నువ్వు అడుగు వేయలేవు. రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం సీఎంలను కళాకారులు సత్కరించేవాళ్లు. అప్పుడు మాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని.. అందరూ సమానంగా లేరని చెప్పుకునే వాళ్లం. ప్రభుత్వం తరపు నుంచి సాయం అడిగేవాళ్లం. కళాకారులను ఎంకరేజ్ చేసేలా ప్రభుత్వం తరపున ఏవైనా అవార్డులు ఇవ్వాలని కోరుకునే వాళ్లం. ఇప్పుడు కేసీఆర్, జగన్‌లను సత్కరించామా? లేదు. వారిని సత్కరించి సమస్యలను వారి దృష్టికి తీసుకురావాలని మోహన్ బాబు తన కుమారుడు విష్ణుకు సూచించారు.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox