Breaking News

ఎల్ ఆర్ఎస్ దరఖాస్తు గడువు పెంపు

16 th Oct 2020, UTC
ఎల్ ఆర్ఎస్ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్ :లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) విషయమై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకొనేందుకు గడువును నెలాఖరువరకు పెంచింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో పలుచోట్ల కరెంటు సరఫరా, ఇంటర్నెట్‌కు అంతరాయం కలగడంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేక పోయారని, ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలని ప్రజల నుంచి వినతులు వచ్చాయని తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లితో సమీక్షించి దరఖాస్తుల గడువు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 

లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం కోసం దరఖాస్తు చేసుకొనేందుకు ప్రభుత్వం తొలుత విధించిన గడువు గురువారంతో ముగిసింది. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం బుధ, గురువారాలు సెలవు ప్రకటించడంతో మీ-సేవా కేంద్రాలు మూతపడి చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. గురువారం రాత్రి 9 గంటల వరకు 19.33 లక్షల దరఖాస్తులు రాగా ఇందులో చివరి రోజే 2.53 లక్షల దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అక్రమ, అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను తప్పనిసరి చేస్తూ ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణ చేయించుకోకుంటే, సదరు అక్రమ ప్లాట్ల తదుపరి క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్‌ జరపబోమని, ఇళ్ల నిర్మాణ అనుమతులు సైతం జారీ చేయబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో 45 రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 19.33 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox