Hyderabad: తెలంగాణ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత వారంతో పోలిస్తే రోజువారీ కేసులు రెట్టింపయ్యాయి. మంగళవారం ఒక్క రోజే రాష్ట్రంలో 403 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ఒక్క హైదరాబాదులోనే 240 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 103, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. కోలుకుంటున్న వారి సంఖ్య కంటే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య సైతం 2,375 కి పెరిగింది.
రాష్ట్రంలో గత మూడు నెలలకు పైగా కరోనా మరణాలు నమోదు కాలేదు. రాష్ట్రంలో కోవిడ్ మరణాల రేటు 0.51 శాతంగా ఉండగా, రికవరీ రేటు 99.19 శాతంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 9లక్షలకి పైగా జనభా కి కరోనా టెస్టులు చేశారు. అయితే గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9923 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండగా, తమిళనాడు, హర్యానాల్లోనూ 700కి చేరువలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో గత కొన్నిరోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా అధికమవుతుండడంతో రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. అంతేకాదు, వ్యాక్సినేషన్ పూర్తిచేయించుకోవడం చాలా ముఖ్యమని స్పష్టం చేసింది. మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. పదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు అవసరమైతేనే బయటకు రావాలని ప్రభుత్వం సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఆరోగ్యశాఖ సూచించింది. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయొద్దని, జ్వరం, ఒళ్లు నొప్పులు, జలుబు తదితర కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కు వెళ్లి వైద్యసాయం పొందాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
22 Jun 2022
22 Jun 2022
20 Jun 2022
25 Jun 2022
25 Jun 2022