Breaking News

సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు

21 st Jul 2021, UTC
సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు

తెలంగాణ సర్కార్ థియేటర్ యజమానులకు శుభవార్త చెప్పింది. సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతించింది. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది. అయితే మల్టీప్లెక్స్, కమర్సియల్ కాంప్లెక్స్‌లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. అలాగే ఈ నెల 23 నుంచి థియేటర్ల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతించింది. 

ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో థియేటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ వెల్లడించింది. ఈ నెల 23 నుంచి సినిమాల ప్రదర్శన చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. తెలంగాణా అంతటా 100 శాతం ఆక్యుపెన్సితో థియేటర్లు ప్రారంభం కానున్నాయి. ఇటీవల రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఫిలించాంబర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సినిమా హాళ్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారుసినిమా థియేటర్లను 100 శాతం సామర్థ్యంతో తిరిగి ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది.

మరోవైపు సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. సంస్థలో కార్మికుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో 43,899 మంది సింగరేణి కార్మికులకు లబ్ధి కలగనుంది. అలాగే రామగుండంలో సింగరేణి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. మరిన్ని వార్తలు చదవండి 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox