Breaking News

తెలంగాణలో భూముల ధరలు పెంపు

21 st Jul 2021, UTC
తెలంగాణలో భూముల ధరలు పెంపు

తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు 6 నుంచి 7.5 శాతం పెంచింది. ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.  ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నా, పెరిగిన ధర చెల్లించాల్సిందేనని సర్కార్ ఆదేశాల్లో పేర్కొంది. వ్యవసాయ భూముల విలువ 50 శాతం పెంచింది. అలాగే వ్యవసాయ భూముల కనిష్ట విలువ ఎకరాకు రూ.75 వేలుగా నిర్ణయించారు. ఓపెన్ ఫ్లాట్ల కనిష్ట విలువ చదరపు గజానికి రూ.200కు పెంచారు. అపార్ట్‌మెంట్లలో కనిష్ట విలువ చదరపు అడుగుకు రూ. వెయ్యి చొప్పున పెంచింది. 

కొద్దిరోజుల కిందట రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరించాలని తెలంగాణ కేబినెట్ సబ్‌కమిటీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా భూములు, ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఏపీలో 11 శాతం, తమిళనాడులో 7.5 శాతం, మహారాష్ట్రలో 7 శాతంగా రిజిస్ట్రేషన్ విలువ వుంది. గడిచిన ఎనిమిదేళ్లుగా తెలంగాణలో రిజిస్ట్రేషన్ విలువలు పెరగలేదు. ఇందుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ త్వరలోనే కేసీఆర్‌కు నివేదిక అందజేయనుంది. 

రిజిస్ట్రేషన్ రేట్లు పెంచడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏడాది రూ.3,400 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జరిగిన రిజిస్ట్రేషన్‌ లావాదేవీల సగటును తీసుకుని లెక్కలు కట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా జాతీయ, రాష్ట్ర, అంతర్‌ జిల్లా రహదారులు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలను బట్టి విలువలను నిర్ధారించినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. మరిన్ని వార్తలు చదవండి 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox