Breaking News

ఈ సారికి సెలవల్లేవ్.. ఈ ఇంటర్‌ అకడమిక్‌ క్యాలెండర్ చూడండి..!

10 th Sep 2020, UTC

హైదరాబాద్ :కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోలేదు. విద్యార్థులంతా ఇళ్లకు పరిమితం అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ అకడమిక్‌ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఇందులో షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయడం, పరీక్షల నిర్వహణ కోసం పండగ సేవలను కుదించేసింది. దసరా కు పది రోజుల పండగ సేవలను కేవలం మూడు రోజులకు కుదించింది. అలాగే సంక్రాంతి పండగ సేవలను కూడా ఒకరోజుకే కుదించింది.

వచ్చే ఏడాది అంటే 2021లో మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరుపబోతున్నట్లు షెడ్యూల్ లో ఇంటర్ బోర్డు పేర్కొంది. అకడమిక్‌ ఇయర్‌ లాస్ట్‌ వర్కింగ్‌ డే గా 2021 ఏప్రిల్‌ 16ను నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు ఇంటర్ బోర్డు ప్రవేశాలపై స్పష్టత ఇవ్వలేదు. ఈ సారి ప్రవేశాలు ఆన్ లైన్ ద్వారానే జరగనున్నాయి. తొందరలోనే ఈ ప్రవేశాలపై కూడా ఇంటర్ బోర్డు స్పష్టత ఇవ్వబోతోంది. మరో వైపు గురువారం టీఎస్ పాలిసెట్-2020  ఫలితాలు వెలువడ్డాయి. విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ నాంపల్లిలోని కార్యాలయంలో ర్యాంకుల ఫలితాలను విడుదల చేసారు. టీఎస్ పాలిసెట్-2020 ప్రవేశాల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశారు.

ఈ నెల 12వ తేదీ నుంచి మొదటి దఫా ప్రవేశాలను స్వీకరించనున్నారు. 12 నుంచి 17వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 14 నుంచి 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు కోసం, 22న సీట్ల కేటాయింపు కోసం ఖరారు చేశారు. సీట్లు పొందిన వారు  22 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో ట్యూషన్‌ ఫీజు చెల్లించి సెల్ప్‌ రిపోర్ట్‌ చేయవలసి ఉంటుంది. ఈ నెల 30 నుంచి పాలిసెట్ తుది విడుత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 1న వెబ్ ఆప్షన్ల కోసం, అక్టోబర్ 3న సీట్ల కేటాయింపు కోసం ఖరారు చేశారు. కాగా అక్టోబర్‌ 7 నుంచి పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox