Breaking News

భాగ్యనగరం లో పాముల పార్కు..!

05 th Jun 2020, UTC
భాగ్యనగరం లో పాముల పార్కు..!

తెలంగాణ రాష్ట్రానికి రాజధాని హైదరాబాదు పర్యాటక ప్రదేశాలకు పెట్టింది పేరు. తాజాగా... ఈ భాగ్యనగరం లో మరో కలికితురాయి వచ్చి చేరింది.  తాజాగా హైదరాబాద్ లో పాముల పార్కును ఏర్పాటు చేశారు. నగరం పరిధిలోని బౌరంపేట రిజర్వు ఫారెస్టులో రూ.1.40కోట్ల వ్యయంతో పాముల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పార్కును ఈరోజు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో భాగంగా చెన్నైలోని గిండి స్నేక్ పార్క్ కు ఈ స్నేక్ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు.  ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పట్టుకున్న పాముల సంరక్షణ, అలాగే వివిధ రకాల పాముల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ పార్క్ ఇకపై ఉపయోగపడనుంది.

         కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో 35 ఎకరాల్లో ఈ స్నేక్‌ రెస్క్యూ సెంటర్‌ (సర్పాల పునరావాస కేంద్రం)ను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ (HoFF) ఆర్. శోభ, పీసీసీఎఫ్ మునీంద్ర, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదనపు పీసీసీఎఫ్ లు చంద్రశేఖర్ రెడ్డి, కుక్రేటి, మేడ్చల్ డీఎఫ్ వో సుధాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎక్కడైనా పాములు కనిపిస్తే.. స్నేక్ సొసైటీకి సమాచారం అందిస్తే... వీరు అరగంటలో ఆ స్థలానికి చేరుకొని.. ఆ పాముని పట్టుకుని తీసుకెళ్తారు. ఇక్కడ...వరికైనా పాములు పట్టుకోవాలనిపిస్తే శిక్షణ కూడా ఇస్తారట. నిర్మల్‌లో కోతుల పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. నెల రోజుల్లో కోతుల పునరావాస కేంద్రాన్ని ప్రారంభిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఈ నెల 20 నుంచి ఆరో విడత హరితహారం ప్రారంభం కానుందని ఈ సందర్భం గా ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox