Breaking News

పోలీసులను గొప్ప గా చూపడం తప్పయిందన్న సింగం సినిమా డైరెక్టర్..!

29 th Jun 2020, UTC

            తమిళ నాట ఇటీవల ఓ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కస్టడీ లో ఉన్న తండ్రి కొడుకులు ఇద్దరు మృతి చెందారు.  ఈ వ్యవహారం స్థానికం గా సంచలనం సృష్టించింది. తూత్తుకొడి జిల్లాలో స‌తాన్కులం టౌన్లో జ‌య‌రాజ్, ఫెనిక్స్ అనే తండ్రీ కొడుకులు పోలీసులు క‌స్ట‌డీలో ఉండగా.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది. స్థానికులతో సహా.. పలువురు సెలెబ్రిటీలు పోలీసులపై విమర్శల దాడికి దిగుతున్నారు. సినీ సెలెబ్రిటీలు సైతం.. పోలీసుల తీరును విమర్శిస్తున్నారు.
 
             తమిళ నాడు ప్రభుత్వం కూడా జరిగిన ఘటన పై విచారం వ్యక్తం చేసి నష్టపరిహారం ప్రకటించింది. అయితే.. స్థానికులు కూడా అకార‌ణంగా ఇలా మ‌నుషుల‌ను చంపి, ప‌రిహారాల‌ను ప్ర‌క‌టిస్తే  ఏమొస్తుందని విమర్శలు చేస్తున్నారు.  ఈ ఘటన పై విచారణకు కూడా ఆదేశించినట్లు సమాచారం. చాల మంది ఈ ఘటన పై స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, న‌టి-రాజ‌కీయ నేత కుష్భూ తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ ఘటన పై స్పందించారు.
 
              తాజాగా.. సింగం సినిమా డైరెక్టర్  హ‌రి. సామి కూడా స్పందించారు. ఆయన పోలీసులను హై లైట్ చేస్తూ.. సింగం సిరీస్ తీసిన సంగతి తెలిసిందే.. స్వామీ స్క్వైర్ అంటూ ఇంకో సినిమాను కూడా పోలీసులను ఓ రేంజ్ హీరో లు గా చూపిస్తూ.. తీశారు. అయితే..పోలీసులను ఈ రేంజ్ హీరో లు గా చూపించడం తప్పయిందంటూ ఆ డైరెక్టర్ ఇపుడు విచారం వ్యక్తం చేస్తున్నారట. పోలీసులు అంత గొప్ప వాళ్ళేమి కాదని ఆయన అభిప్రాయం తెలుపుతున్నారట.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox