Breaking News

 శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం..!

17 th Oct 2020, UTC
 శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం..!

ఆంధ్రప్రదేశ్ :నేటి నుంచి  శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇంద్రకీలాద్రి మీది దుర్గమ్మ స్వర్ణకవచాలంక్రుత శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు అభయాన్నిస్తోంది. ఈ నెల 25 వ తేదీ వరకు తొమ్మిది రోజుల్లో పది అలంకారాల్లో దుర్గమ్మ తల్లి దర్శనం ఇవ్వనుంది. ఉదయం తొమ్మిది గంటలనుంచి ఇంద్రకీలాద్రి పైన అమ్మవారిని దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వనున్నారు. కరోనా మహమ్మారి దృష్ట్యా రోజుకు పదివేల మందికి మాత్రమే దర్శన భాగ్యం కలగనుంది. 

ఈ ఏడాది అమ్మవారి దర్శనానికి స్లాటు విధానం అమలు చేస్తున్నారు. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలి. బుకింగ్ పూర్తి అయిన తరువాత మీకు స్లాట్ టైమింగ్ వస్తాయి. ఆ టైంలోనే దర్శనానికి అనుమతిస్తారు. స్లాట్, మాస్క్ లేకుండా దర్శనానికి అనుమతించరు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేసారు. అయితే ఎప్పటిలా ఉండే ప్రత్యక్ష పూజలకు ఈసారి అనుమతి లేదు. పరోక్షంగా వీడియో ద్వారా పూజను చూసే అవకాశం మాత్రం ఈసారి కలిపించారు. 

ఈ ఏడాది ఉత్సవాలకు నాలుగు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసారు. ఉదయం 3 గంటల నుంచి తొమ్మిది గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు దర్శనాలకు విఐపి లకు దర్శనం కల్పిస్తారు. పది సంవత్సరాల లోపు పిల్లలకు 60 ఏళ్ల పైబడిన వారికి ఈసారి దర్శనానికి అనుమతి లేదు. దుర్గగుడి ఉద్యోగులకు ప్రతి మూడురోజులకొకసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox