Breaking News

వ‌ల‌స కార్మికుల‌కు తగిన ఉద్యోగాలు కల్పించాలి:సుప్రీంకోర్టు ఆదేశం

09 th Jun 2020, UTC

వ‌ల‌స కార్మికుల‌ను గుర్తించి వారి నైపుణ్యాల‌కు త‌గిన విధంగా ఉద్యోగాలు క‌ల్పించేలా ప్ర‌ణాళిక రూపొందించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేర‌కు దాదాపు కోటిమందికి పైగా వారి స్వ‌గ్రామంలోనే ప‌ని క‌ల్పించేందు  ఓ జాబితా త‌యారుచేయాల‌ని అన్ని రాష్ర్ట ప్ర‌భుత్వాల‌కు సూచించింది. లాక్‌డౌన్ కార‌ణంగా చాలామంది ఉపాధి కోల్పోయార‌ని, ముఖ్యంగా వ‌ల‌స కార్మికులు తీవ్ర న‌ష్టాన్ని ఎదుర్కొంటున్నార‌ని అభిప్రాయ‌ప‌డింది.

 ఈ నేప‌థ్యంలోనే వ‌ల‌స‌దారుల‌ను గుర్తించి వారికి ఉద్యోగాలు కల్పించడానికి అందుబాటులో ఉన్న పథకాలకు సంబంధించిన సమాచారాన్ని జులై 8లోపు అఫిడవిట్  ద్వారా కోర్టులో సమర్పించాలని రాష్ట్రాలనుకోరింది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వ‌ల‌స కూలీల‌ను 15 రోజుల్లోగా వారి స్వ‌గ్రామాల‌కు చేర్చాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.వలస కార్మికులను త‌ర‌లించ‌డానికి రైలు స‌దుపాయం క‌ల్పించాల‌ని ఏ రాష్ర్ట‌మైనా కోరిన 24 గంట‌ల్లోపు అందించేలా రైల్వే శాఖ బాధ్య‌త వ‌హించాల‌ని కోరింది. స్వస్థ‌లాల‌కు వెళ్లేందుకు లాక్‌డౌన్ నిబంద‌న‌లు ఉల్లంఘించినందుకు  వ‌ల‌స కూలీలపై న‌మోదు చేసిన కేసుల‌ను ఉప‌సంహ‌రించుకోవాల్సిందిగా రాష్ట్రాలను కోరింది. అవ‌స‌ర‌మైన చోట వలసదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిందిగా సూచించింది.

 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వలస కార్మికుల కోసం ప్రస్తుతం ఉన్న పథకాలు, ఉపాధి కల్పన మొదలైన వాటిపై నివేదికలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా వున్న వలస కార్మికులు ఉపాధి కోల్పోవడంతో తమ గ్రామాల బాట పట్టారు. పలువరు రోడ్ల మీద వందలాది కిలోమీటర్లు నడిచి గమ్యాలకు చేరుకోగా మరి కొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో ఇంటిముఖం పట్టారు. ప్రస్తుతం వీరికి ఉపాధి చూపడం ప్రభుత్వాలకు సవాల్ గా మారింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox