Breaking News

స్కాలర్ షిప్ పేరిట కశ్మీరీ యువకులకు పాక్ ఎర..!

12 th Jun 2020, UTC

ఉన్నత చదువుల నిమిత్తమై కశ్మీరీ యువకులకు స్కాలర్ షిప్ రూపంలో తమవైపు తిప్పుకోవాలని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని సర్కార్ ఓ భారీ ప్లాన్ ను రూపొందించింది. ఇలా స్కాలర్‌షిప్‌ ఆశలు చూపి పీఓకే లోని యువకులను తమ వైపు తిప్పుకుని పీవోకే ప్రాంతాన్ని అస్థిరపరచాలని పాకిస్తాన్ వ్యూహం పన్నిందని భద్రతా బలగాలు చెబుతున్నాయి.

 పీవోకే ప్రాంతంలో తమ సానుభూతి పరులను పెంచుకోడానికి పాక్ ఒక పధకం ప్రకారం ఈ స్కాలర్ షిప్ పధకాన్ని ఎరగా వేస్తోంది. యువ కాశ్మీరీలు తమ అధ్యయనం కోసం వాఘా - అత్తారి సరిహద్దు పోస్టు ద్వారా సరిహద్దు దాటి నియంత్రణ రేఖ ద్వారా... తిరిగి ఉగ్రవాదులుగా వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయిఅని ఓ అధికారి పేర్కొన్నారు.

1,600 రూపాయల స్కాలర్‌షిప్‌ను పీవోకే ప్రాంతంలోని యువకులకు అందివ్వాలని అక్కడి పార్లమెంట్ నుంచి కూడా ఆమోద ముద్ర లభించింది. అయితే గతం నుంచి కూడా పీవోకే యువకులకు పాక్ స్కాలర్‌షిప్పులను ప్రకటిస్తోంది. అయితే అవి తక్కువ రూపాయలతో కూడుకుని ఉండేవి. ఈసారి మాత్రం పారితోషకాన్ని పెంచారని అధికారులు పేర్కొన్నారు. పాక్ ఇచ్చే స్కాలర్‌షిప్‌ కోసం దాదాపు 150 మంది యువకులు అప్లై చేసుకున్నట్లు  గుర్తించారు.

అంతేకాకుండా వేర్పాటువాద గ్రూపులైన హురియత్ లాంటి వారి రికమండేషన్ పెట్టి మరీ అప్లై చేసినట్లు కశ్మీరీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌కు వీసా తీసుకొని వెళ్లి చదువుకునే విద్యార్థుల్లో చాలా మంది విద్యార్థులు మాజీ ఉగ్రవాద కుటుంబాలకు చెందినవారు, అలాగే.. ప్రస్తుతం ఉగ్రవాద కార్యకలాపాల్లో తలమునకలై ఉన్న కుటుంబీకులకు చెందిన విద్యార్థులు.. అలాగే.. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగితేలే కుటుంబాలకు చెందిన వారు కూడా ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox