Breaking News

రెమ్ డెసివిర్‌ డోసేజీలో మార్పులు..!

04 th Jul 2020, UTC
రెమ్ డెసివిర్‌ డోసేజీలో మార్పులు..!

కరోనా చికిత్సలో వినియోగిస్తున్న రెమ్ డెసివిర్‌కు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. డోసేజీ ప్రోటోకాల్‌లో మార్పులు చేస్తూ ఓ సర్క్యులర్ జారీ చేసింది.

తాజా మార్గదర్శకాలు ప్రకారం..  మందును వరుసగా ఐదు రోజుల పాటు రోగికి ఇవ్వాలి. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఈ ముందును తొలి రోజున 200 మిల్లీగ్రాములు ఇవ్వాలి. మిగిలి నాలుగు రోజుల్లో 100 మిల్లీగ్రాముల చప్పున ఇవ్వాలి.

కరోనా వ్యాధి లక్షణాలు మధ్యస్థాయిలో ఉండి, బయటినుంచి ఆక్సిజన్ అందించాల్సిన రోగులకు రెమ్డిసివిర్ వినియోగించేందుకు జూన్ 13న కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే కిడ్నీ సంబందిత సమస్యలున్న వారు, గర్భిణులు, పసిపిల్లలున్న తల్లులు, 12 ఏళ్లు లోపు వయసున్న చిన్నారులకు మాత్రం ఈ మందు ఇవ్వకూడదని కూడా అప్పట్లో తెలిపింది.

 ప్రయోగాత్మక చికిత్సలు కింద రెమ్ డెసివిర్‌కు అనుమతిచ్చింది.దీనితోపాటూ..డెక్
సామెథాజోన్, ఫెవిపిరావిర్ మందులకు కూడా అనుమతిచ్చింది. కరోనా తీవ్రంగా ఉన్న వారికి డాక్టర్లు డెక్సామెథాజోన్ సూచిస్తుండగా..వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న కేసుల్లో ఫెవిపిరావిర్‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటిని కూడా కేంద్రం ప్రయోగాత్మక చికిత్సలుగానే గుర్తించింది.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox