Breaking News

రెహానా ఫాతిమాకు బీఎస్ ఎన్ ఎల్ నోటీసు..!

03 rd Jul 2020, UTC
రెహానా ఫాతిమాకు బీఎస్ ఎన్ ఎల్ నోటీసు..!

కేరళకు చెందిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా కన్న కుమార్తె, కుమారుడితో తన అర్ధనగ్న శరీరంపై పెయింట్ వేయించుకుని, ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి సంచలనం సృష్టించింది. దీనితో  ఆమె పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో.. ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు .

 రెహానా ఫాతిమా బీఎస్‌ఎన్‌ఎల్‌లో మాజీ ఉద్యోగి. కొచ్చిలో ఆమె ఉంటున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్‌ను ఖాళీ చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆమెకు నోటీసులు పంపింది
జూన్ 27న జారీ చేసిన ఈ నోటీసులో.. 30 రోజుల్లో క్వార్టర్స్ ఖాళీ చేయాలని ఆమెకు బీఎస్‌ఎన్‌ఎల్ స్పష్టం చేసింది. మే 11, 2020తో రెహానా ఉద్యోగ కాలం ముగిసిందని, ఆమె అప్పటి నుంచే బీఎస్‌ఎన్‌ఎల్‌లో భాగం కాదని తెలిపింది.

 మే 11 తర్వాత క్వార్టర్స్‌లో ఉండేందుకు ఆమె అనర్హురాలని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది.
2018లో శబరిమల అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత రెహానా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

 ఆ సమయంలో హిందువులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టులు పెను దుమారాన్ని రేపాయి. ఈ వివాదంలో ఆమెపై కేసు నమోదైంది. 18 రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox