Breaking News

మాజీ ప్రధాని పీవీపై పోస్టల్ స్టాంప్:కిషన్ రెడ్డి

03 rd Jul 2020, UTC

మాజీ ప్రధాని, తెలుగుబిడ్డ స్వర్గీయ పీవీ నర్సింహారావు ప్రత్యేక పోస్టల్‌స్టాంప్‌ను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పీవీ నర్సింహారావు శతజయంతిని పురస్కరించుకుని ఆయన గౌరవార్ధం తపాళ బిళ్లను విడుదల చేయాలని కేంద్రసమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కోరినట్టు ఆయన తెలిపారు.

తన విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకోవడంపై మంత్రి కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలుతెలిపారు.
పీవీ దూర దృష్టి, సంస్కరణలు, సౌత్‌ ఈస్ట్‌ ఆసియాతో భారత్‌ వ్యూహాత్మక , ఆర్ధిక సంబంధాలను బలోపేతం చేశారని అన్నారు. భారత ఆర్ధిక సంస్కరణల పితగా పీవీ నర్సింహారావుని అభిర్ణించారు.

 పీవీ చేసిన సేవలను భవిష్యత్‌ తరాలకు తెలియజేయాలన్న ఆలోచనతోనే పీవీ పోస్టల్‌స్టాఫ్‌ విషయంలో చొరవ చూపినట్టు తెలిపారు. త్వరలో భారత ప్రభుత్వం పీవీ స్టాంప్‌ను విడుదల చేస్తుందన్నారు. ఇది దేశానికి పీవీచేసిన సేవలను గుర్తిస్తూ గౌరవ చిహ్నంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నట్టు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

దేశరాజధాని ఢిల్లీలో పీవీ మెమోరియల్ కూడ ఎన్డీఏ హయాంలోనే నిర్మించడం జరిగింది. ఇపుడు పీవీపై పోస్టల్ స్టాంపు విడుదల చేయడం ద్వారా ఆయనకు కాంగ్రెస్ కన్నా తామే ఎక్కువ గౌరవం ఇచ్చినట్లు బీజేపీ చెప్పకనే చెబుతోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox