Breaking News

తిరిగి కాలుష్యం దిశగా...ఢిల్లీ..!

06 th Jun 2020, UTC
తిరిగి కాలుష్యం దిశగా...ఢిల్లీ..!
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యానికి పుట్టినిల్లు. పరిశ్రమలు, వాహనాలు వదిలే పొగ, నిర్మాణ రంగానికి సంబంధించిన ఇతర పనుల కారణంగా రాజధాని నగరం ఎప్పుడు కాలుష్యభరితంగా కనిపిస్తుంటుంది. చలికాలం లో అయితే.. పరిస్థితి మరీ దారుణం గా ఉంటుంది. దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉదయం 8, 9 గంటలు అయితే తప్ప 100 మీటర్ల దూరంలోని వస్తువులు కనిపించని పరిస్థితి ఉంటుంది. నవంబర్‌, డిసెంబర్ నెలల్లో అయితే రోడ్లు సరిగా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.
           అయితే.. లాక్ డౌన్ కారణం గా.. రోడ్లపై జనాభా తగ్గి..మార్చి 22 నుంచి మే 18 మధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం బాగా తగ్గింది. దాదాపు 79 శాతం కాలుష్యం తగ్గిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) తెలిపింది. రోడ్లపై కి ఎలాంటి వాహనాలు రాకపోవడం.. పరిశ్రమలు మూత పడటం వంటి కారణాలతో కాలుష్యం దాదాపు తగ్గింది. మే 18 తర్వాత లాక్‌డౌన్‌లో వాహనాల రాకపోకలు, నిర్మాణరంగ పనుల ప్రారంభం లాంటి మరిన్ని సడలింపులు ఇవ్వడంతో ఢిల్లీతోపాటు దేశంలోని మరికొన్ని ప్రధాన నగరాల్లో కాలుష్యం స్థాయి తిరిగి పెరిగింది. ఢిల్లీలో PM 2.5 స్థాయిలు 4 నుంచి 8 రెట్లు పెరుగగా, ఇతర నగరాల్లో 2 నుంచి 6 పెరిగనట్లు వెల్లడించింది.మొదట 97 శాతానికి తగ్గిన PM 2.5 స్థాయి మే 18న పలు సడలింపులు ఇవ్వడంతో 4 నుంచి 8 రెట్లు పెరిగింది. ఇతర నగరాల్లో PM 2.5 స్థాయి లాక్‌డౌన్‌లో 45 నుంచి 88 శాతానికి తగ్గింది. మే 18న సడలింపుల తర్వాత 2 నుంచి 6 రెట్లు పెరిగింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox