Breaking News

ఒకే రోజు 5 గొలుసు దొంగతనాలు చైన్ స్నాచర్ పై పోలీసుల దర్యాప్తు

22 nd Jan 2022, UTC

chain snatcher: వరుస గొలుసు దొంగతనాలు చేసిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ నెల 19న ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వ్యవధిలో నిందితుడు 5 గొలుసు దొంగతనాలు చేశాడు. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో రెండు గొలుసు దొంగతనాలు చేసిన నిందితుడు మరో మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తెంపేందుకు విఫలయత్నం చేశాడు.

ఇదే వ్యక్తి మారేడ్ పల్లిలో ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లాడు. తుకారాంగేట్ పీఎస్ పరిధిలోనూ మరో మహిళ మెడలో బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. అక్కడి నుంచి నేరుగా మేడిపల్లి పీఎస్ వైపు వెళ్లి అక్కడ వీధిలో ఉన్న ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లాడు. ఒకే రోజు వ్యవధిలో మూడు కమిషనరేట్ల పరిధిలో 5 గొలుసు దొంగతనాలు చేసాడు. ఈ నెల 18వ తేదీన జియాగూడలో సాయంత్రం 5 గంటల సమయంలో పార్క్ చేసి ఉన్న స్కూటీని ఎత్తుకెళ్లిన నిందితుడు... ఆ స్కూటీని ఉపయోగించుకొనే గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు.

నిందితుడు ఉపయోగించిన స్కూటీని పోలీసులు మేడిపల్లిలోని సంపూర్ణ హోటల్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. అతను ఎటువైపు పారిపోయి ఉంటాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు

మరిన్ని వార్తలు తప్పక  చదవండి 

మరలా పెరిగిన బంగారం, వెండి ధరలు 

మ‌హారాష్ట్రలోని గ‌డ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు బీభ‌త్సం

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox