హైదరాబాద్ :ద్విచక్ర వాహనాలపై వెళుతున్నప్పుడు మన రక్షణ కోసం హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలి. అయితే, చాలా మంది వాహనదారులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం పట్ల అలసత్వం వహిస్తున్నారు. ఈ విషయం పట్ల పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నప్పటికీ ఖాతరు చేయడం లేదు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేసారు. హెల్మెట్ లేకుంటే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో మనకి తెలియక కాదు. కానీ నిర్లక్ష్యం వహిస్తున్న వారు రోజురోజు కు ఎక్కువ అవుతున్నారు.
ఈ నేపధ్యంలో ఇక పై హెల్మెట్ లేకుండా బండి నడిపితే కేవలం చలానాతో సరిపెట్టి ఊరుకోమని, సదరు వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తామని పోలీసులు ట్విట్టర్ మాధ్యమం ద్వారా హెచ్చరికలు జారీ చేసారు. ఇకపై మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తామని ప్రకటించారు. మొదటి సారి మూడు నెలల పాటు, రెండవ సారి పట్టుబడితే, శాశ్వతం గా డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దుచేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేసారు. మరిన్ని వార్తలు చదవండి
మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది.#RoadSafety #RoadSafetyCyberabad@cyberabadpolice @TelanganaCOPs pic.twitter.com/AWbxWDLTZM
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 19, 2021

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
25 Feb 2021
25 Feb 2021