Breaking News

బిహార్‌ సీఎం నివాసంలో కరోనా వైరస్..!

08 th Jul 2020, UTC
బిహార్‌ సీఎం నివాసంలో   కరోనా వైరస్..!

బిహార్‌లో  స్వయంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసంలో కరోనా వైరస్ ప్రభావం చూపడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. పట్నాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఉంటున్న ఆయన దగ్గరి బంధువుకు కరోనా పాజిటివ్ వచ్చింది.

సీఎం మేనకోడలికి క‌రోనా పాజిటివ్‌ రావడంతో ఆమెను పట్నా ఎయిమ్స్ లోని ఐసోలేషన్ వార్డుకు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. సీఎం అధికారిక నివాసాన్ని పూర్తిగా శానిటేష‌న్ చేయించారు.. త్వరలోనే సీఎం కుటుంబ స‌భ్యులంద‌రికీ క‌రోనా ప‌రీక్షలు చేయనున్నారు. అలాగే పట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పిఎంసిహెచ్) నుండి మూడు వేర్వేరు బృందాలను ముఖ్యమంత్రి నివాసానికి తరలించారు. ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఉత్తర్వుల ప్రకారం, వెంటిలేటర్‌తో కూడిన తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. వైద్యులు, నర్సులు మూడు షిఫ్టులలో ఇక్కడ పని చేయనున్నారు.

 బిహార్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్ అవధేశ్‌ నారాయణసింగ్ కరోనా బారిన పడటంతో సీఎం నితీష్‌ కుమార్‌ కు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించారు. శనివారం సీఎంకు కరోనా నెగిటివ్ వచ్చింది. జెడి (యు) కు చెందిన గులాం ఘౌస్ కూడా  కరోనా పాజిటివ్  వచ్చింది.

మరో వైపు  ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్  మాట్లాడుతూ సీఎం నమూనా పరీక్షా ఫలితాలు రెండు గంటల్లో వచ్చేసాయి కానీ సాధారణ ప్రజలకు  5-7 రోజులు పడుతోందని ఆరోపించారు. పేద ప్రజలు వైద్య సదుపాయాలు లేక అల్లాడుతోంటే, సీఎం నివాసాన్ని ఏకంగా ఆసుపత్రిగా మార్చేసారని విమర్శించారు. రాష్ట్రంలో అటు పరీక్షలూ, ఇటు చికిత్సలు లేవంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.

కేసులు విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వానికి చింత లేదనీ, ఎన్నికలకు సన్నద్ధమవుతోందంటూ ఆరోపించారు. కేసులకు సంబంధించి డేటాను దాచిపెడుతోందని కూడా ఆయన విమర్శించారు. ఇప్పటికైనా స్పందించకపోతే ఆగస్టు-సెప్టెంబర్ నాటికి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని  ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox