Breaking News

నిసర్గతుఫానుతో విమానాలు రద్దు... రైళ్లు రీ షెడ్యూల్..!

03 rd Jun 2020, UTC

నిసర్గ తుఫాన్ తీరం దాటడంతో  విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసాయి. జూన్ 3 నాటికి ముంబై చేరే, ..అక్కడి నుంచి బయల్దేరే 17 విమానాలను నిసర్గ కారణంగా తామూ రద్దు చేశామని  ఇండిగో ప్రకటించింది. విస్టా,స్పైస్ జెట్ ..సంస్దలు కూడ  ముంబై, గోవా వెళ్లే విమానాలు, అక్కడి నుంచి వచ్చే విమానాలు నడపడం కష్టమని ప్రకటించాయి.

ఇక, నిసర్గ తుఫాను ప్రభావం రైళ్లపై కూడా పడింది. ముంబై చేరుకునే, అక్కడి నుంచి బయల్దేరే రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబైకి చేరుకునే ప్రత్యేక రైళ్లను రీషెడ్యూల్ చేశామని, వాటిని ఇతర మార్గాలకు మళ్లించినట్లు రైల్వే స్పష్టం చేసింది.

ఇక తుఫాను  వల్ల ముంబయ్ నగరంపై పరిస్దితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దమయింది. ఎన్డీఆర్ ఎఫ్, వైద్య  బృందాలను రెడీగా వుంచింది. పౌరులు ఇళ్లల్లోనే వుండాలని ఎటువంటి ఇబ్బందులు ఎదురయినా వెంటనే తమను సంప్రదించాలని సూచించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox