Breaking News

యూపీలో 51 కు చేరిన మిస్టరీ వైరల్ ఫీవర్ మరణాలు

06 th Sep 2021, UTC

ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో "మిస్టరీ వైరల్ జ్వరం" కారణంగా మరణించిన వారి సంఖ్య 51 కి పెరిగింది.వైరస్ మహమ్మారి యొక్క మూడవ తరంగ ముప్పు ఎక్కువగా ఉన్న సమయంలో "మిస్టీరియస్ వైరల్ ఫీవర్" తో ప్రజలు తీవ్ర అందోళనకు గురవుతున్నారు.  యుపిలోని ఎటావా జిల్లాలో ఆగస్టు 1 నుండి 5,500 కేసులు నమోదయ్యాయి. బల్లియా, మధుర మరియు మొరాదాబాద్ వంటి ఇతర జిల్లాలలో కూడా సంక్రమణ కేసులు పెరుగుతున్నాయి.

కేసుల పెరుగుదల  నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షించడానికి రాష్ట్రంలోని 75 జిల్లాలకు నోడల్ అధికారులను నియమించింది. సంక్రమణ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రజలను పరీక్షించడానికి మొరాదాబాద్‌లో ఇంటింటికీ సర్వే నిర్వహించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. సర్వే సెప్టెంబర్ 7 న ప్రారంభమవుతుంది.ఈ వ్యాధికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించడానికి కేంద్రం గతంలో నిపుణుల బృందాన్ని ఫిజోరాబాద్‌కు  పంపింది.ప్రాథమిక నమూనాలపై బృందం చేసిన పరిశోధనలో డెంగ్యూ మరియు స్క్రబ్ టైఫస్, బ్యాక్టీరియా వ్యాధి ఉన్నట్లు నిర్ధారించబడినట్లు తెలిసింది. ఈ బృందం  సోమవారం  తన నివేదికను కేంద్రానికి సమర్పిస్తుంది. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసకుంటారు.

సోమవారం, అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీ ( ఏఎస్ఎంసి ) ని సందర్శించిన ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాధ్ అక్కడ చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యాధులను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని మధుర, మరియు మెయిన్‌పురి జిల్లాలకు బృందాలను పంపించాలని సంబంధిత అధికారులను సీఎం యోగి  ఆదేశించారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox