Breaking News

అందుకే పద్మారావు కు కరోనా వచ్చింది..!

08 th Jul 2020, UTC
అందుకే పద్మారావు కు కరోనా వచ్చింది..!
తెలంగాణ లో కరోనా మహమ్మారి ఉద్ధృతం గా ఉన్న సంగతి తెలిసిందే. రోజూ కు 1800 లకు పైగా కేసులు నమోదవడం.. అటు అధికారుల్లోనూ.. ఇటు ప్రజల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. అయితే.. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. కరోనా లాక్ డౌన్ వలన అంతమవడాని.. లాక్ డౌన్ వలన సంభవించే మరణాలు కరోనా మరణాల కంటే ఎక్కువగా ఉంటాయని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.. కరోనా మహమ్మారి ఉద్ధృతి ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది అని అన్నారు.. కరోనా కట్టడిలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారనే రాజకీయ విమర్శలు వారి పైశాచిక ఆనందం కోసం మాత్రమేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అలా అయితే.. తాము కూడా కేంద్ర ప్రభుత్వం విమర్శల దాడికి దిగొచ్చని.. కానీ ఇది అందుకు సరైన సమయం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తప్పులు ఎక్కడో ఓ చోట ఉన్నంత మాత్రాన.. వాటిని పట్టుకుని..అదో  బూచి లా చూపించడం తప్పని అన్నారు.. ఓ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు తాను మాస్క్ పెట్టుకోమని చెబితే పెట్టుకోలేదని.. ఆ మరుసటి రోజే ఆయనకు కరోనా వచ్చిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అందుకే కరోనా నివారణ కోసం ముందు నిబంధనలను కచ్చితం గా పాటించాలని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox