Breaking News

కోమటిరెడ్డి బ్రదర్స్ విశ్వసనీయత కోల్పోయారు.. మంత్రి జగదీశ్ రెడ్డి

29 th Jul 2021, UTC

Politics : కోమటిరెడ్డి బ్రదర్స్‌ ను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ విశ్వసనీయత కోల్పోయారని వారికి విజ్ఞత వుంటే అభివృద్ధికి సహకరించాలని మంత్రి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నియోజకవర్గంలో ప్రజలే తిరుగుబాటు చేస్తారని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. 

బుధవారం కూడ మంత్రి జగదీశ్ రెడ్డికోమటిరెడ్డి బ్రదర్స్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదిలో నల్గొండ జిల్లా వాటా అమ్ముకుని డబ్బులు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల ఉసురు తీసింది వీళ్లేనని మంత్రి మండిపడ్డారు. ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా ఖబద్దార్ అంటూ జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. వాళ్ల బాసులనే తరిమి, తరిమి కొట్టామని వీళ్లెంత అంటూ మంత్రి మండిపడ్డారు. వ్యక్తిగత జీవితాల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.

మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నందుకుగాను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. తహసీల్దార్ గిరిధర్ ఫిర్యాదుతో  చౌటుప్పల్ పోలీసులు ఈ కేసు నమోదు చేసారు. మరిన్ని వార్తలు చదవండి 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox