Breaking News

ఏనుగులకు ఐదు కోట్ల ఆస్తి రాసేసాడు..!

12 th Jun 2020, UTC
ఏనుగులకు ఐదు కోట్ల ఆస్తి రాసేసాడు..!
అనాదిగా భూమి మీద మనిషికి, జంతువులకు అనుభందం వుంది. పెంపుడు జంతువులను ఇప్టంగా, ప్రాణంగా పెంచుకునే వారు ఎందరో వుంటారు. వాటి తిండి, ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద చూపుతారు. ఏ కారణం చేతయినా అవి అనారోగ్యం పాలయినా, మరణించినా సొంత కుటుంబ సభ్యలే అయినట్లుగా బాధపడటం సహజం.  వ్యక్తులు తాము సంపాదించిన ఆస్తులను తమ తరువాత కుటుంబ సభ్యులకు రాసివ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. కానీ బీహార్ లో ఒక వ్యక్తి రూ5 కోట్లు విలువ చేసే స్దలాన్ని ఏనుగుల పేరిట రాసేయడం సంచలనం కలిగించింది.

తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న రెండు పెంపుడు ఏనుగుల పేరిట ఐదు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని రాసేశాడో వ్యక్తి బిహార్‌లో  జరిగిన ఈ పంఘన కు సంభందించి వివరాలివి.. జానిపుర్‌ గ్రామానికి చెందిన అక్తర్‌ ఇమామ్‌కి చిన్నప్పటినుంచి ఏనుగులంటే ప్రాణం. అందుకే 12 ఏళ్ల వయసునుంచే వాటిని సంరక్షించటం మొదలు పెట్టాడు. 15 ఏళ్ల క్రితం ‘ఐరావత్‌’ పేరిట ఓ ఎన్జీఓ సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం అతడి దగ్గర మోతీ, రాణి అనే రెండు ఏనుగులు ఉన్నాయి.వాటిని ఎంతో ప్రాణపదంగా చూసుకుంటున్న ఇమామ్ వాటి పేర దాదాపు ఐదు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని వీలునామా రాసేశారు ..

అయితే తాను ఏనుగుల పేర కోట్లాది రూపాయల ఆస్తిని రాసేయడాన్ని ఇమామ్ సమర్దించుకున్నాడు.
నేను ఏనుగుల పేరిట కోట్ల ఆస్తి రాయటం పిచ్చి నిర్ణయం కాదు. మోతీ,రాణిలు నా ప్రాణాలు కాపాడాయి. అవే నా నిజమైన కుటుంబం. వాటిని సంరక్షించటం నా కెంతో ఇష్టం. నా ప్రాణాలకు ప్రస్తుతం  వేటగాళ్లు,  స్మగ్లర్ల నుంచి ప్రమాదం ఉంది. అందుకే నా ఆస్తిని వాటి పేరిట రాసేశాను. నేను చనిపోయినా అవి సంతోషంగా బ్రతుకుతాయి.  అవి చనిపోయిన తర్వాత నా కుటుంబానికి కూడా ఆ ఆస్తి చెందదు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్జీఓకు బదిలీ అవుతుంది. నేను ఇదివరకే నాకు చెందిన పెద్దల ఆస్తిలో నా అక్కాచెల్లెళ్లకు, మాజీ భార్యకు, ముగ్గురు కుమారులకు వాటా పంచానుఅన్నారు.

కొన్ని సంవత్సరాల క్రితం  తాను ఒక పనిమీద బయటకు వెళ్లినపుడు మోతీని కూడా వెంటతీసుకెళ్లానని ఇమామ్ తెలిపాడు. అర్థరాత్రి  తాను  నిద్రలో ఉండగా మోతీ అరుపులు వినిపించాయని, వెంటనే కిటికీలోంచి బయటకు చూస్తే .సంకెళ్లు తెంచుకున్న మోతీ తుపాకులతో ఉన్న దుండగులను తరుముతున్న దృశ్యం కనిపించిందన్నాడు. దుండగుల బారి నుంచి తన ప్రాణాలు కాపాడిన ఆ ఏనుగుకు తానేమిచ్చినా తక్కవేనని స్పష్టం చేసాడు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox