Breaking News

హైదరాబాద్ లో కోవిడ్ హెల్ప్ లైన్ ప్రారంభించిన మజ్లిస్

27 th Apr 2021, UTC

హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి సోమవారం ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేసి, కోవిడ్ -19 మెడికల్ కిట్లను పంపిణీ చేసారు. నగరంలో నిరుపేదలకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. 1.4 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. భారతదేశం అంతటా వ్యాపించిన  కోవిడ్ సెకండ్ వేవ్ ను ఎదుర్కునేందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో కేంద్రం విఫలమైందని ఆయన ఆరోపించారు.

ఎన్నికల కమిషన్ ఏమి చేస్తోంది? తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తోంది? దీనిని పరిశీలించడం ఎన్నికల కమిషన్ యొక్క విధి. ఈ ప్రభుత్వానికి నియంత్రణ లేదు. పారదర్శకత లేదు, వారు కోరుకున్నది ఏదైనా చేయగలరు. ఆ మాకు ఆక్సిజన్ లేదు అని దేశ  రాజధానిలో హైకోర్టుకు వెళ్లారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఏమి జరుగుతుందో మీరు ఊహించగలరా ? అని ఒవైసీ ప్రశ్నించారు.వ్యాక్సిన్ల కోసం ఆర్డర్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని ఆయన అన్నారు, "వ్యాక్సిన్ ప్రజలకు ఇవ్వడానికి  4 రోజుల ముందు వారు ఆర్డర్ ఇస్తారు. చాలామందికి రెండవ మోతాదు వ్యాక్సిన్ రావడం లేదు, టీకా అందుబాటులో లేదు.  ప్రతి భారతీయుడికి మేము వ్యాక్సిన్ ఇస్తామన్న మోడీ ప్రభుత్వం  అందులో విఫలమయిందని ఒవైసీ ఆరోపించారు.

ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం నిర్మిస్తే కరోనా రోగులకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉండేదన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన కొంతమంది నేతలు కోర్టులను ఆశ్రయించి నిర్మాణాలను ఆపివేయించారని విమర్శించారు. కొవిడ్‌ వార్‌ రూం నుంచి సాయం అందుకునేందుకు 7306600600 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. మరిన్ని వార్తలు చదవండి 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox