Breaking News

పోలీస్ స్టేషన్ కే కన్నం వేసిన లాయర్ దొంగ

08 th Jan 2022, UTC

అక్కడా ఇక్కడా ఎందుకని ఏకంగా పోలీస్ స్టేషన్ కే కన్నం వేసాడు ఒక ప్రబుద్దుడు. అయితే ఈ దొంగతనానికి గాను అతను పోలీసు వేషం వేయడం గమనార్హం.  ఆంధ్రప్రదేశ్  లోని నెల్లూరు కు చెందిన రాజేంద్ర కుమార్ కొందరు న్యాయవాదుల వద్ద గుమస్తాగా పనిచేసే వాడు. కేసులకు సంబంధించిన ఫైల్స్, ఇతర వ్యవహారాలు చూసుకొనే రాజేంద్ర కావలి పోలీస్ స్టేషన్ కు తరచూ వెళ్లివచ్చేవాడు. అయితే తానే లాయర్ నంటూ పోలీసులకు చెప్పేవాడు.  పోలీసు స్టేషన్ కు వచ్చే అతడిని లాయర్ గానే భావించిన పోలీసులు గౌరవంగా చూసేవారు.

 ప్రతీరోజూ  పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో అతను  రెక్కీ నిర్వహించాడు. సరైన టైమ్ చూసుకొని పోలీస్ స్టేషన్లో నిలిపి వుంచిన వాహనాలను దొంగిలింవాహనాలు కనిపించకపోయే సరికి కానిస్టేబుళ్లు స్టేషన్ ఆఫీసర్ కు సమాచారం ఇచ్చారు. తొలుత సిబ్బందిలో ఒకరు  చేసివుంటారని అనుమానించినా దర్యాప్తు సాగుతున్న కొద్దీ వారికి షాకింగ్ నిజాలు తెలిశాయి.

ప్రతిరోజూ లాయర్ అంటూ స్టేషన్ కు వచ్చి కలరింగ్ ఇస్తున్న రాజేంద్రనే అసలు దొంగ అని గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకొని చోరీ చేసిన జూపిటర్ మరియు యమహా FZ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద నుంచి 1,40,000 రూపాయల విలువ చేసే రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంమీద ఈ లాయర్ దొంగ పోలీసు స్టేషన్ కే కన్నం వేసినప్పటికీ తొందరగానే దొరికిపోయాడు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox