Breaking News

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్..!

07 th Sep 2020, UTC

కొత్తగూడెం :చర్ల - ఛత్తీస్ ఘడ్ సరిహద్దు అడవుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు లు మృతి చెందారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి తరలి వెళ్లారు. మావోయిస్టులు మందు పాతర పేల్చిన గంట వ్యవధిలోనే పోలీస్ లు ఎదురు దాడికి దిగారు. ఈ వరుస ఘటనలతో, ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు ఉదయం తాలిపేరు ప్రాజెక్టు రోడ్ వద్ద మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
 
మావోయిస్టులు కేవలం తమ ఉనికి కోసమే మందుపాతరను పేల్చారని స్పష్టం అవుతోందని పోలీస్ లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం భద్రాద్రి జిల్లా గుండాల మండలం దేవల గూడెం వద్ద పోలీస్ లు మావోయిస్టు శంకర్ ను ఎన్కౌంటర్ చేసారు. అయితే, శంకర్ ఎన్కౌంటర్ కు నిరసనగా ఆదివారం రోజున మావోయిస్టు లు బంద్ కు పిలుపునిచ్చారు. భద్రాద్రి జిల్లా తూర్పు గోదావరి జిల్లా భూపాలపల్లి ములుగు జిల్లాలలో బంద్ పాటించారు. అయితే, ఈ బంద్ వల్ల జనాలకు ఇబ్బంది కాలేదు. గత రాత్రి మావోయిస్టులు చర్ల సమీపంలోని తిప్పాపురం అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై మందు పాత్ర ను పేల్చారు. ఆ ప్రాంతం లో శంకర్ పేరుతొ ఓ కరపత్రాన్ని కూడా ఉంచి వెళ్లారు. దీనితో పోలీస్ లు ఉలిక్కిపడ్డారు. కూంబింగ్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని పోలీస్ లు తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox