Breaking News

హోం ఐసోలేషన్‌ కు కొత్త మార్గదర్శకాలు..!

04 th Jul 2020, UTC
హోం ఐసోలేషన్‌ కు కొత్త మార్గదర్శకాలు..!

కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో  లక్షణాలు తక్కువగా ఉన్నవారు, ఇంట్లో వసతులు ఉన్న వారంతా హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో హోం ఐసోలేషన్‌ విధానాన్ని కట్టుదిట్టం చేస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు మార్పులు చేసింది. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేలా, ప్రతిరోజూ వైద్యుల పరిశీలన ఉండేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొత్తగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లకు ఆన్‌లైన్‌లో వైద్యుల సలహాలు, సూచనలు అందుతున్నాయి. అయితే కేంద్రం తాజా ఆదేశాల ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రతి బాధితుడిని వైద్యులు లేదా వైద్య సహాయకుడు తప్పకుండా పరిశీలించాలి. రోగి శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ శాతంతోపాటు గుండె వేగం ఎంత ఉందో పరీక్షించి ఆ వివరాలను కోవిడ్‌–19 పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అలాగే బాధితుడితో ఎవరైనా కాంటాక్ట్‌ అయ్యారా లేదా అని చెక్‌ చేస్తూ అలాంటి వారుంటే వైద్యుడి సలహా మేరకు పరీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకోవాలి.

 ఇదివరకు కేవలం లక్షణాలు లేని వాళ్లకు మాత్రమే హోం ఐసోలేషన్‌కు అనుమతివ్వగా తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులున్నప్పటికీ వాటిని నియంత్రణలో ఉంచుకొనే వారు కూడా వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉండొచ్చు. హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు అంగీకరించిన బాధితుడు ప్రభుత్వానికి అండర్‌టేకింగ్‌ ఇవ్వాలి. తనకు వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలిచ్చే డాక్టర్‌ కూడా అందులో సంతకం (కౌంటర్‌ సైన్‌) చేయాల్సి ఉంటుంది. అవయవ మార్పిడి, కేన్సర్, హెచ్‌ఐవీ రోగులకు మాత్రం హోం ఐసోలేషన్‌కు అనుమతి లేదు.

కరోనా బాధితుడి హోం ఐసోలేషన్‌ గడువు ఇప్పటిదాకా 17 రోజులుగా ఉంది.ఇపుడు.కేవలం పది రోజులు ఉంటే హోం ఐసోలేషన్‌ నుంచి డిశ్చార్జి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో వరుసగా మూడు రోజులపాటు ఎలాంటి లక్షణాలు ఉండకూడదు. అయితే హోం ఐసోలేషన్‌ నుంచి డిశ్చార్జి అయినప్పటికీ మరో వారంపాటు రోగి తప్పకుండా ఇంట్లోనే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.

కరోనా వైరస్‌ సోకిన వారికి జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పితోపాటు ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలను కేంద్ర నిర్ధారించింది. తాజాగా ఈ లక్షణాల జాబితాలో మరో రెండు అంశాలను జోడించింది. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, ఫిట్స్‌ రావడం, మాటలు నత్తిగా రావడం లాంటి వాటిని కూడా లక్షణాల జాబితాలో చేర్చింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox