Breaking News

గ్రేటర్ ఎన్నికల వేళ.. కేసీఆర్ వరాల జల్లు..!

23 rd Nov 2020, UTC

హైదరాబాద్ :గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రచారం షురూ చేసాయి. ఇరు వర్గాలు సై అంటే సై అంటూ విమర్శలు చేసుకోవడం జరుగుతున్నాయి. నింద మాది, విందు మీది అన్నట్లు వారెంతగా విమర్శలు విసురుకున్నా, ప్రజలకు మాత్రం వరాల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ కు విశ్వ ఖ్యాతి తీసుకొచ్చే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పుకొచ్చారు.

భాగ్య నగరానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. జిహెచ్ ఏంసి పరిధిలో ఉచిత తాగునీరు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఎవరు ఇక పై నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు తెరాస పార్టీ అందించే పధకాల గురించి వివరం ఇస్తూ "మన నగరం మన పరిపాలన మన పార్టీ" పేరుతొ ఎన్నికల మేనిఫెస్టో ను విడుదల చేసారు. తొంభై కిలోమీటర్ల వరకు ఎంఎంటి ఎస్ రైళ్లను విస్తరించనున్నట్లు ఈ మేనిఫెస్టో లో పేర్కొన్నారు..

డిసెంబర్ నెల నుంచి నీటి బిల్లు మాఫీ చేస్తామని ప్రకటించారు. 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీటి సరఫరా అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఫించన్లు అందిస్తామని తెలిపారు. హై టెన్షన్ విద్యుత్ వైర్లు అన్ని ఇకపై అండర్ గ్రౌండ్ లోనే ఉండనున్నాయి. సినీ ఇండస్ట్రీకి కూడా సీఎం కేసీఆర్ వరాలిచ్చేశారు. సినిమా థియేటర్లకు షోలు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా గడ్డు కాలంలో సినిమా థియేటర్లకు అయినా విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాలలో లాగ, టికెట్ ధరలను సవరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

పది కోట్లలోపు బడ్జెట్ లతో తీసే సినిమాలకు జిఎస్టి నుంచి మినహాయింపుని కల్పిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. సెలూన్లు, దోబిఘాట్లకు ఉచిత విద్యుత్ అందివ్వనున్నట్లు తెలిపారు. బస్తీలలో ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. రాయిదుర్గం నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రో ట్రైన్ ను పొడిగిస్తామని హామీ ఇచ్చారు. బీఎస్ఎన్ఎల్ నుంచి మెహిదీపట్నం వరకు కూడా మెట్రో మార్గం ఏర్పాటు చేయనున్నారు. నగరంలో రెండో దశ కింద 125 లింకు రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే, సినీ కార్మికులకు ఉచితంగా రేషన్ కార్డులను, హెల్త్ కార్డులను అందించనున్నారు. మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox