Breaking News

స్నేహితుడికి ఆక్సిజన్ సిలెండర్ కోసం 1300 కిలోమీటర్లు ప్రయాణం

28 th Apr 2021, UTC

జార్ఖండ్ రాంచీకి చెందిన దేవేంద్ర కుమార్ శర్మ  కరోనాతో బాధపడుతున్న తన స్నేహితుడికి  ఆక్సిజన్ సిలెండర్ తేవడానికి 24 గంటల్లో 1,300 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాడు. అతనికి ఏప్రిల్ 24న తన స్నేహితుడు సంజయ్ సక్సేనా నుండి పిలుపు వచ్చింది. కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్దారణ అయిన వారి స్నేహితుడు రాజన్‌కు అత్యవసరంగా ఆక్సిజన్ అవసరమని సక్సేనా దేవేంద్రకు తెలిపాడు. 

దానితో దేవేంద్ర తన మోటారుబైక్ పై రాత్రి బొకారోకు బయలు దేరాడు. 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత దేవేంద్ర జార్ఖండ్ గ్యాస్ ప్లాంట్ యజమాని రాకేశ్ కుమార్ గుప్తాను సంప్రదించి ఆక్సిజన్ సిలెండర్లు సంపాదించాడు. తరువాత, దేవేంద్ర  1,300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఘజియాబాద్ చేరుకున్నాడు. అతను తన పరిచయస్తులలో ఒకరి నుండి కారు తీసుకొని వైశాలి పయనమయ్యాడు. దాదాపు 24 గంటలు ప్రయాణించిన తరువాత, దేవేంద్ర ఏప్రిల్ 26 న వైశాలి చేరుకున్నాడు

దారిలోఆక్సిజన్ సిలిండర్ల గురించి పోలీసులు అతనిని ప్రశ్నించారు. అనారోగ్యంతో ఉన్న తన స్నేహితుడి గురించి దేవేంద్ర వారికి వివరించాడు. ఇది జీవితం మరియు మరణం యొక్క విషయం అని చెప్పాడు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox