Breaking News

అమానుషం.. వీధికుక్కల నోట్లో యాసిడ్ పోసి చంపేసారు

06 th Sep 2021, UTC

మధ్యప్రదేశ్ లో  కొందరు వ్యక్తులు వీధికుక్కలపై అమానుషంగా ప్రవర్తించారు. ఐదు వీధికుక్కల నోటిలో యాసిడ్ పోసి చంపారు. సెప్టెంబర్ 2 న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాలక్ష్మీ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ప్రజల్లో అగ్రహావేశాలను రేకెత్తించింది.ఒక వ్యక్తి ఇండోర్‌కు చెందిన జంతు హక్కుల బృందానికి డయల్ చేయడంతో ఈ సంఘటన తెరపైకి వచ్చింది. . గాయపడిన కుక్కలను పశు వైద్యశాలకు తరలించగా అక్కడ మరణించాయి.

జంతు హక్కుల సంఘం సంఘటనకు సంబంధించి పోలీసు సూపరింటెండెంట్‌ కు ఫిర్యాదు చేయడంతో  కేసు నమోదు చేసారు.నిందితులను గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించబడ్డాయి. అనాగరిక నేరానికి పాల్పడిన వ్యక్తుల గుర్తింపు కోసం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు స్కాన్ చేస్తున్నారని అధికారులు తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామ పంచాయితీ ఆదేశాల మేరకు 300 కు పైగా వీధికుక్కలను విషపూరితం చేసి చంపివేసిన కొన్ని వారాల తర్వాత ఇది జరిగింది.

పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం ప్రాంతంలోని  కుక్కలను విషపూరితం చేసి ఖననం చేసారు. దీనిపైచల్లపల్లి చారిటబుల్ ట్రస్ట్ అధికారి ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు, భారతీయ శిక్షాస్మృతి మరియు జంతువుల పట్ల హింస నిరోధక చట్టం, 1960 లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.మరో సంఘటనలో కర్ణాటకలో దాదాపు 30 కోతులు చంపిగన్నీ బ్యాగ్‌లలో ప్యాక్ చేసి పడేసారు.  కర్ణాటక హైకోర్టు ఈ సంఘటనపై సుమోటోగా స్వీకరించి విచారణను ప్రారంభించింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox