Breaking News

భారత నౌకాదళ అమ్ములపొదిలో మరో ఆయుధం..!

31 st Oct 2020, UTC
భారత నౌకాదళ అమ్ములపొదిలో మరో ఆయుధం..!

విశాఖపట్నం :భారత నౌకాదళం కూడా తన బలాన్ని పెంచుకుంటోంది. ఇటీవల కొత్త యుద్ధ పరికరాలతో భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత నౌకాదళంలో మరో కొత్త ఆయుధం వచ్చి చేరింది. తూర్పు నౌకాదళ పరిధిలోని బంగాళాఖాతంలో యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ కోరా’ నుంచి నౌకా విధ్వంస క్షిపణి ని ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతమైంది. ఈ విషయాన్నీ నౌకాదళం ట్విట్టర్ మాధ్యమం ద్వారా తెలిపింది. 

నౌకా విధ్వంస క్షిపణి  గరిష్ట దూరంలోని లక్ష్యాన్ని సమర్థవంతంగా, ఖచ్చితత్వంతో ఛేదించగలిగిందని, లక్ష్యంలో పెట్టిన నౌక ధ్వంసమైందని ట్విట్టర్ మాధ్యమం ద్వారా పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా నౌకాదళం పోస్ట్ చేసింది. గత కొన్ని రోజులుగా భారత్ వరుసగా క్షిపణి పరీక్షలను చేస్తోంది. అరేబియా సముద్రంలో యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ ప్రబల్’ నుంచి ఇటీవల ఓ ప్రయోగం జరపగా అది కూడా విజయవంతమైంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్, అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన శౌర్య సూపర్ సోనిక్ క్షిపణి లను కూడా లాంచ్ చేసారు. ఇంకా హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ వెహికల్‌ను కూడా ఒడిశా తీరంలోని వీలర్ ఐలండ్‌లో ఏపీజే అబ్దుల్ కలాం లాంచ్ కాంప్లెక్స్ నుంచి విజయవంతంగా లాంచ్ చేశారు.  మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox