Breaking News

24 గంటల్లో 25 వేల కరోనా కేసులు..!

09 th Jul 2020, UTC
24 గంటల్లో 25 వేల కరోనా కేసులు..!

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో  24,879 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో మహమ్మారి బారినపడి 487 మంది ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో గురువారం నాటికి మొత్తం పాజిటివ్‌ కేసులు 7,67,296కు చేరగా మరణాల సంఖ్య 21,129కు పెరిగింది. ఇక కరోనా నుంచి కోలుకున్న వారిసంఖ్య 4,76,378కి పెరగడంతో రికవరీ రేటు 62.8 శాతంగా నమోదైంది.

2,17,121 కోవిడ్‌-19 కేసులతో, 9250 మరణాలతో మహారాష్ట్ర మొదటి స్దానంలో కొనసాగుతోంది.1,18,594 కేసులు, 1636 మరణాలతో తమిళనాడు తర్వాతి స్ధానంలో నిలిచింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకూ 1,02,831 కరోనా కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 3165కు పెరిగింది.
జులై 7 వరకూ దేశవ్యాప్తంగా 1,04,73,771 శాంపిళ్లను పరిశీలించగా, పాజిటివిటీ రేటు 9.31 శాతంగా ఉందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు 1.28 కోట్లకు చేరగా 5,48,429 మంది మరణించారు.

 అమెరికాలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్ధాయిలో 60,000 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. కోవిడ్‌-19 తీవ్రతతో అమెరికాలోని పలు రాష్ట్రాలు తిరిగి లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox