Breaking News

పెరిగిన భారతీయుల ఆయుర్దాయం.. గణనాంకాలు ఏమంటున్నాయి..?

16 th Oct 2020, UTC

ఆరోగ్యవార్తలు :గత దశాబ్దంతో పోలిస్తే, ఈ దశాబ్దంలో భారతీయుల సగటు ఆయుర్దాయం పది సంవత్సరాలు పెరిగింది. తాజాగా భారతీయుల సగటు ఆయుష్షు 70.8 ఏళ్లకు చేరుకున్నది. అంటే సగటు జీవిత కాలానికి పదేళ్లు పెరిగింది. ఈ ఆయుర్దాయాల అధ్యయనానికి సంబంధించి, లాన్సెట్ జర్నల్ ఇటీవల ఓ నివేదికను ప్రచురించింది. 1990 దశకంలో సగటు జీవిత కాలం 59.6 ఏళ్ళుగా ఉంది. తాజాగా 2019 నాటికి 70.8 ఏళ్లకు చేరుకుంది.
 
అయితే సగటు ఆయుర్దాయం పెరిగినప్పటికీ భారత్ అన్ని రాష్ట్రాలలోను అసమానతలు ఉన్నాయి. కేరళలో మనిషి జీవితకాలం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నది. తాజా అధ్యయనం ప్రకారం ఆ రాష్ట్రంలో సగటు వ్యక్తి జీవితకాలం 77.3 ఏళ్లకు చేరుకున్నది. మరో వైపు ఉత్తర ప్రదేశ్ లో ఓ వ్యక్తి జీవితకాలం 66.9 ఏళ్లకు పెరిగింది అని లాన్సెట్ రిపోర్ట్ లో పేర్కొంది. సగటు ఆయుర్దాయం పెరిగినప్పటికీ ఇక్కడి మనుషులు అంత ఆరోగ్యంగా జీవించడం లేదని ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్పష్టం చేసింది. ఎక్కువ శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతో బతుకులు సాగిస్తున్నారని తెలిపింది. అయితే భారత్ లోనే కాకుండా చాలా దేశాల్లో అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయని దీర్ఘకాలిక వ్యక్తులు మాత్రం ఎక్కువగా ఉన్నాయని వాషింగ్టన్ వర్సిటీ ప్రొఫెసర్ అలీ మోక్‌దాద్  తెలిపారు. ఒకప్పుడు శిశుమరణాలు ఎక్కువగా ఉన్న భారత్ లో నేడు గుండె సంబంధిత, క్యాన్సర్ మరణాలు ఎక్కువయ్యాయని తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox