Andhrapradesh: బంగాళాఖాతంలో అసని తుపాను అలజడి కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం కాకినాడకు 330 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 350 కిలోమీటర్లు, గోపాలపూర్ కు 510 కిలోమీటర్లు, పూరీకు 590 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. ఇవాళ రాత్రికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చి అనంతరం దిశ మార్చుకుని ఉత్తరాంధ్ర ఒడిశా తీరాలకు దూరంగా ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతం వైపు వెళ్ళే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 12 గంటల్లో తీవ్రతుపాను క్రమంగా బలహీన పడి తుపానుగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో, బుధవారం ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశముంది. రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇటు పశ్చిమగోదావరి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 40-60 కిమీ వేగంతో గాలులు విస్తాయని, వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలకు SDRF, NDRF బృందాలను సిద్ధం చేసింది. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుపాను నేపధ్యంలో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాయాత్రాంగాన్ని అప్రమత్తం చేసిన విపత్తుల సంస్థ, సహాయక సామాగ్రిని తరలించింది.
సముద్రం అలజడిగా ఉండటంతో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, రైతులు ముందుగానే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సూచించింది. ఈదురు గాలులు వీస్తున్నందున భారీ వృక్షాలకు, విద్యుత్ స్తంభాలకు సమీపంలో ఉండొద్దని తెలిపింది.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022