Breaking News

మొదటి రోజు మియాపూర్-ఎల్బీ నగర్ రూట్‌ లోనే మెట్రో..!

04 th Sep 2020, UTC

హైదరాబాద్ :కరోనా మహమ్మారి నేపధ్యంలో ఇప్పటి వరకు ప్రజా రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే, నిబంధనలను సడలిస్తూ వస్తున్న నేపధ్యంలో తాజాగా మెట్రో కు అనుమతులు ఇచ్చారు. ఈ నెల ఏడవ తేదీ నుంచి మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. అయితే, తొలి రోజు మెట్రో సేవలను అన్ని రూట్లలోను నడపడం లేదు. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

మొదటి రోజు మియాపూర్-ఎల్బీ నగర్ రూట్‌ లోనే మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని అన్నారు. రెండో రోజు నుంచి కారిడార్-3లోని నాగోల్-రాయదుర్గం మధ్య రైళ్లు నడుపుతామని తెలిపారు. 9న కారిడార్-1, 2,3లో పూర్తిస్థాయిలో సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే, భరత్‌నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసుఫ్‌గూడ స్టేషన్లు కంటైనెమెంట్ జోన్లు కావడంతో ఈ స్టేషన్లలో మెట్రో రైలు ఆగదని తెలిపారు. ఆ స్టేషన్లు మూసివేసి ఉంటాయని తెలిపారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒక్కో ట్రైన్ నడుస్తుందని తెలిపారు. స్మార్ట్‌కార్డులు, నగదు రహిత పద్ధతిలోనే టికెట్లు విక్రయించనున్నట్లు తెలిపారు. ప్రవేశ మార్గాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. స్టేషన్లు, కోచ్‌లలో సామజిక దూరం పాటించడానికి వీలుగా మార్కింగ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. మాస్క్ ధరించకపోతే జరిమానా విధిస్తామని తెలిపారు. కరోనా లక్షణాలు లేని వారు ట్రైన్లలో ప్రయాణించాలని కోరారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox