Breaking News

తెలంగాణలోని 8 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

11 th May 2022, UTC

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లోని పలుచోట్ల నేడు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్‌ భూపాల పల్లి, మంచిర్యాల జిల్లాల్లో  ఇవాళ అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరా బాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చ రికలు జారీ చేసింది.

బుధ, గురువారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మొత్తంగా రాగల మూడు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో  కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర తుపాను ‘అసని‘ పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉదయం 8.30 గంటలకు కాకినాడకు ఆగ్నేయ దిశగా 260 కిలోమీటర్ల దూరం లో కేంద్రీకృతమై ఉంది.

ఈ తీవ్ర తుపాను వాయవ్య దిశగా పయ నించి అదేరోజు రాత్రికి పశ్చిమ మధ్యబంగాళా ఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అది దిశ మార్చు కుని ఉత్తర ఈశాన్యం వైపు కదిలి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరంలోని వాయవ్య బంగాళా ఖాతంలోకి చేరుకునే అవకాశం ఉంది. అది క్రమంగా బలహీన పడి 24 గంటల్లోపు తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం తెలంగాణపైనా ఉండే అవకాశం కనబడుతోంది.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox