Breaking News

తెలంగాణలోకి నైరుతి పవనాలు.. 48 గంటల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు

15 th Jun 2022, UTC

Hyderabad: నైరుతి రుతుప‌వ‌నాల ప్రభావంతో  తెలంగాణలో మూడు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  రాగల 48 గంటల్లో తెలంగాణలోని మరి కొన్ని జిల్లాలకు, ఆ  తర్వాత  2 రోజుల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది.  ముఖ్యంగా పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు గాలులు  వీస్తున్నట్లు  తెలుస్తోంది. 

హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా కూడా వానలు దంచికొడుతున్నాయి. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ నైరుతి పవనాలు విస్తరించాయి. దీంతో గౌహతి, జార్ఖండ్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 

నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, కొంకణ్, మహారాష్ట్ర, మరాఠ్వాడా, కర్ణాటకలోని చాలా ప్రాంతాలు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని భాగాలు, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలకు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox